అల్పపీడనం ప్రభావం.. రేపు, ఎల్లుండి ఏపీలో భారీ వర్షాలు
వాయుగుండం తుపానుగా మారితే మాత్రం తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.
ఉక్కపోత, ఎండ వేడితో అల్లాడిపోతున్న జనానికి కాస్త తెరిపినిచ్చే వార్త. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని ఐఎండీ ప్రకటించింది. శనివారం అది తుపానుగా బలపడే అవకాశాలున్నాయనీ చెప్పింది. దీంతో శని, ఆదివారాల్లో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
వాయుగుండం తుపానుగా మారితే మాత్రం తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లోనూ ఓ మోస్తరు వానలు పడతాయని తెలిపింది.
పిడుగులు పడతాయి జాగ్రత్త
భారీ వర్షాలు, ఓ మోస్తరు వానలు శని, ఆదివారాల్లో రాష్ట్రమంతా పడే అవకాశాలున్నాయి. దీనికితోడు పిడుగులు కూడా పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.