Telugu Global
NEWS

హామీలపై ప్రశ్నిస్తే పోలీసులతో కొట్టిస్తరా?

రేవంత్‌ హౌలా.. అలాంటి వ్యక్తికి భయపడాల్సిన అవసరం లేదు : కేటీఆర్‌

హామీలపై ప్రశ్నిస్తే పోలీసులతో కొట్టిస్తరా?
X

కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే పోలీసులతో కొట్టిస్తారా అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ రెడ్డి హౌలా అని.. అలాంటి వ్యక్తులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్‌ హామీలను ప్రశ్నించిన మహబూబ్‌ నగర్‌ కు చెందిన భాస్కర్‌ ముదిరాజ్‌ ను సీఐ అప్పయ్య బెల్ట్‌ తో కొట్టడాన్ని కేటీఆర్‌ ఖండించారు. బుధవారం భాస్కర్‌ తో ఆయన ఫోన్‌ లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రశ్నించే వారిని కొట్టే హక్కు పోలీసులకు ఎక్కడిదని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన సీఐపై న్యాయ పరంగా పోరాటం చేస్తామన్నారు. పార్టీ అండగా ఉంటుందని భాస్కర్ కు భరోసా ఇచ్చారు. పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు మద్దతుగా నిలుస్తున్న పోలీసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికీ మిత్తీతో సహా చెల్లిస్తామన్నారు.

First Published:  30 Oct 2024 5:14 PM IST
Next Story