Hyundai Exter | హ్యుండాయ్ ఎక్స్‌టర్‌పై క్రేజ్.. ఆ 2వేరియంట్ల కోసం ఏడాది వెయిట్ చేయాల్సిందే..!
హ్యుండాయ్ ఎక్స్‌టర్ మోడల్ కారు పెట్రోల్ పవర్ ట్రైన్‌తోపాటు సీఎన్జీ వేరియంట్‌లోనూ లభిస్తుంది. ఎక్స్‌టర్ ఇంజిన్ 1.2 లీటర్ల సామర్థ్యంతోపాటు ఫోర్ సిలిండర్, నాచురల్లీ యాస్పిరేటెడ్ యూనిట్‌తో వస్తుంది.
Hyundai Exter | దేశంలోని కార్ల మార్కెట్‌లో మారుతి సుజుకి (Maruti Suzuki) తర్వాత స్థానం.. దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India)దే. ఇటీవలే భారత మార్కెట్‌లోకి హ్యుండాయ్ మోటార్ ఇండియా తన మైక్రో-ఎస్‌యూవీ మోడల్ ఎక్స్‌టర్ (Hyundai Exter) ఆవిష్కరించింది. క్రెటా తర్వాత హ్యుండాయ్ ఉత్పత్తి చేస్తున్న అత్యంత ముఖ్యమైన మోడల్ కారుగా మైక్రో-ఎస్‌యూవీ ఎక్స్‌టర్ (Hyundai Exter) నిలిచింది. ఇటీవలే మార్కెట్లో రిలీజ్ అయినా.. ఎక్స్‌టర్ కారుపై కార్ల ప్రేమికులు క్రేజ్ పెంచుకున్నారు. భారీగా ప్రీ-బుకింగ్స్ నమోదయ్యాయి. హ్యుండాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter) కారు కావాలంటే దాదాపు ఏడాది పాటు వెయిట్ చేయాల్సిందే. ఏడు వేరియంట్లలో విడుదలైన ఎక్స్‌టర్.. ఈఎక్స్, ఈఎక్స్ (ఓ) వేరియంట్ల కోసం ఏడాది పాటు, మిగతా వేరియంట్ల కోసం ఐదారు నెలలు వేచి చూడాల్సిందే.
హ్యుండాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter) ఏడు వేరియంట్లు - ఈఎక్స్, ఈఎక్స్ (ఓ), ఎస్, ఎస్ (ఓ), ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ (ఓ) కనెక్ట్ వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ.6 లక్షల నుంచి మొదలై టాప్ హై ఎండ్ వేరియంట్ ధర రూ.10.10 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. ఇవి ప్రారంభ ధరలు మాత్రమే.
టాటా పంచ్, మారుతి సుజుకి ఫ్రాంక్స్ మోడల్ కార్లతో ప్రాథమికంగా హ్యుండాయ్ ఎక్స్‌టర్ పోటీ పడుతుందని భావిస్తున్నారు. వీటితోపాటు మారుతి సుజుకి ఇగ్నిస్, రెనాల్ట్ కైగర్, సిట్రోన్ సీ3, నిస్సాన్ మాగ్నైట్ మోడల్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్నది.
హ్యుండాయ్ ఎక్స్‌టర్ మోడల్ కారు పెట్రోల్ పవర్ ట్రైన్‌తోపాటు సీఎన్జీ వేరియంట్‌లోనూ లభిస్తుంది. ఎక్స్‌టర్ ఇంజిన్ 1.2 లీటర్ల సామర్థ్యంతోపాటు ఫోర్ సిలిండర్, నాచురల్లీ యాస్పిరేటెడ్ యూనిట్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 81.86 బీహెచ్పీ విద్యుత్, 113.8 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. సీఎన్జీ వేరియంట్ కారు గరిష్టంగా 68 బీహెచ్పీ విద్యుత్, 95.2 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. గరిష్టంగా 6000 ఆర్పీఎం వద్ద గరిష్ట విద్యుత్, 4000 ఆర్పీఎం వద్ద గరిష్ట టార్చి వెలువరిస్తుంది.
హ్యుండాయ్ ఎక్స్‌టర్ పెట్రోల్ వేరియంట్స్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ, సీఎన్జీ వేరియంట్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌తో వస్తున్నది. ఏఎంటీ గేర్ బాక్స్ మృదువుగానూ ఉంటుంది. గేర్‌బాక్స్ స్లాట్స్ పాజిటివ్ ఫీల్‌తో ఉంటాయి. రిఫైన్డ్ చేసిన ఇంజిన్ కలిగి ఉండటంతోపాటు ఏఎంటీ గేర్ బాక్స్ స్మూత్‌గా గేర్లు వేసేందుకు వెసులుబాటుగా ఉంటుంది.