సివిల్స్, గ్రూప్స్‌కు ఇలా ప్రిపేర్ అవ్వండి!
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన చాలామంది పబ్లిక్ సర్వీస్ కమిషన్, సివిల్ సర్వీసెస్ వంటి ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతుంటారు. ఇలాంటి ఎగ్జామ్స్‌కు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎలాంటి టాపిక్స్ ఎక్కువగా రిఫర్ చేయాలి?
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన చాలామంది పబ్లిక్ సర్వీస్ కమిషన్, సివిల్ సర్వీసెస్ వంటి ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతుంటారు. ఇలాంటి ఎగ్జామ్స్‌కు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎలాంటి టాపిక్స్ ఎక్కువగా రిఫర్ చేయాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
సివిల్స్‌కు జరిగే ఎంపిక మొత్తం మూడు దశల్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్‌లో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. రెండో స్టేజ్‌లో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మూడో స్టేజ్‌లో పర్సనల్ ఇంటర్వ్యూ జరుగుతుంది. అయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో రెండు పేపర్లు ఉంటాయి. ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే.. అభ్యర్థులు రెండు పేపర్ల కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వాలి. జనరల్ స్టడీస్ పేపర్‌గా నిర్వహించే పేపర్–1లో.. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అలాగే రెండో పేపర్‌లో.. రీడింగ్ కాంప్రహెన్షన్, న్యూమరికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ లాంటి ఆప్టిట్యూడ్ అంశాలుంటాయి.
పుస్తకాలు ఇవీ..
జనరల్ స్టడీస్ పేపర్-1 కోసం పుస్తకాలు జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ పుస్తకాలు తిరగేయాల్సి ఉంటుంది. వాటిలో కొన్ని ఇవి..
జాగ్రఫీ కోసం -జాగ్రఫీ బై జిసి లియోంగ్, ఎన్ సీఈఆర్ టీ 11, 12 టెక్స్ట్ బుక్స్ చదవాలి. హిస్టరీ కోసం - ఇండియన్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ బై బిపిన్ చంద్ర , ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడరన్ ఇండియా బై స్పెక్ట్రమ్, ఎన్‌సీఈఆర్‌టీ క్లాస్ 11 టెక్స్ట్ బుక్స్ చదవాలి.
ఆర్ట్ అండ్ కల్చర్ కోసం ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ బై నితిన్ సింఘానియా, -ఎన్‌సీఈఆర్‌టీ క్లాస్ 12 ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ టెక్స్ట్ బుక్.. పాలిటిక్స్ కోసం ఇండియన్ ఎకానమీ బై ఎమ్ లక్ష్మీకాంత్,- ఎన్‌సీఈఆర్‌టీ క్లాస్ 11: ఇండియన్ ఎకనామిక్ డెవలప్ మెంట్, -ఇండియన్ ఎకానమీ బై రమేష్ సింగ్ వంటి పుస్తకాకలు బెటర్.
ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం 6 వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేయొచ్చు. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ కోసం - ఎన్‌సీఈఆర్‌టీ క్లాస్ 12 బయాలజీ టెక్స్ట్ బుక్,- శంకర్ ఐఏయస్ బుక్ లెట్ వంటివి చదవొచ్చు.
ఇక ఆప్టిట్యూడ్ టెస్ట్ పేపర్- II కోసం పుస్తకాలతో పాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా తిరగేయాల్సి ఉంటుంది. - క్రిప్టోకరెన్సీ, రష్యా వార్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి లేటెస్ట్ టాపిక్స్ తో పాటు వరల్డ్ కరెంట్ అఫైర్స్ తిరగేయాలి. కరెంట్ టాపిక్స్ కు సంబంధించిన హిస్టరీ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. అలాగే 2021, 2022, 2023 సంవత్సరాల్లో వార్తల్లోకెక్కిన అన్ని అంశాలను ఒకసారి పరిశీలించడం మంచిది.