Telugu Global
NEWS

కెరీర్‌ను ఎలా ఎంచుకోవాలంటే..

ఇంటర్ చదువు పూర్తయిన తర్వాత కెరీర్‌‌ను ఎంచుకునేందుకు బోలెడు ఆప్షన్స్ రెడీగా ఉంటాయి.

కెరీర్‌ను ఎలా ఎంచుకోవాలంటే..
X

ఇంటర్ చదువు పూర్తయిన తర్వాత కెరీర్‌‌ను ఎంచుకునేందుకు బోలెడు ఆప్షన్స్ రెడీగా ఉంటాయి. ఈ టైంలోనే సరైన అవగాహనతో మంచి కెరీర్‌‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కోర్సుని సెలక్ట్ చేసుకునేముందు అది మీకు సూట్ అవుతుందా? లేదా? అన్నది ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. దీనికై కొన్ని టిప్స్ ఫాలో అవ్వొచ్చు.

సాధారణంగా టీనేజ్ వయసులో ఉన్న స్టూడెంట్స్‌కు కెరీర్ పరమైన నిర్ణయాలు తీసుకునేంత అవగాహన ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడే మరింత స్పష్టంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వేరొకరి అభిప్రాయాలను గుడ్డిగా నమ్మకుండా సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. అదెలాగంటే..

కెరీర్ లేదా కోర్సు ఎంపికలో మొదటి ప్రాధాన్యత మీ మనసుకి ఇవ్వాలి. మీకు చిన్నప్పట్నుంచి ఏదైనా కెరీర్‌‌పై మక్కువ ఉంటే దాన్ని ఎంపిక చేసుకోవడమే మేలు. ఒక రంగంపై ఇష్టం ఉండి మీలో ఆ రంగంలో రాణించదగ్గ స్కిల్స్ ఉన్నాయని మీరు భావిస్తే.. అటువంటి రంగాన్నే ఎంచుకోవాలి.

రంగాన్ని ఎంచుకున్న తర్వాత అందులో ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉంటాయో రిసెర్చ్ చేసి అందులో మీకు ఏది సూట్ అవుతుందో దాన్ని ఎంచుకోవాలి. ఉదాహరణకు మీకు మోడలింగ్ ఇష్టం అనుకుంటే అందులో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. మోడలింగ్‌లో బీటెక్, డిప్లొమా, డిగ్రీ వంటి పలు కోర్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే మోడలింగ్‌లో ఫ్యాషన్ మోడలింగ్, జువెలరీ మోడలింగ్, ప్రొడక్ట్ మోడలింగ్.. వంటి పలు రకాలుంటాయి. ఇలా ఆప్షన్స్‌పై రీసెర్చ్ చేసి ఆపైన నిర్ణయం తీసుకోవాలి.

కెరీర్ ను ఎంచుకునేటప్పుడు చేయాల్సిన మరో ముఖ్యమైన పని.. ఆయా రంగాల్లో ఉన్నవారిని ఫాలో అవ్వడం. మీరు అనుకున్న రోల్స్‌లో సక్సెస్ అయిన వారిని ఫాలో అవ్వడం ద్వారా ఆ కెరీర్ పై ఒక అవగాహన వస్తుంది.

మీకొక స్పష్టమైన గోల్ లేదా ఇంట్రెస్ట్ లేనట్టయితే.. పేరెంట్స్ లేదా కెరీర్ కౌన్సెలర్ సలహా మేరకు కోర్సు ఎంపిక చేసుకోవచ్చు. మీ ఇష్టాయిష్టాలు, మీ సామర్థ్యాలను బట్టి వాళ్లు కూడా మంచి నిర్ణయమే తీసుకునే అవకాశం ఉంటుంది.

ఇకపోతే చాలామందికి మంచి ఉద్యోగం, సంపాదనే లక్ష్యంగా ఉంటుంది. ఏ రంగంలో అయినా రాణించేందుకు వీళ్లు సిద్ధంగా ఉంటారు. ఇలాంటివాళ్లు కాస్త రీసెర్చ్ చేసి, కెరీర్ కౌన్సెలర్ సలహా కూడా తీసుకుని.. ఫ్యూ్చర్‌‌లో మంచి డిమాండ్ ఉండే రంగాలను ఎంచుకుంటే మంచిది.

ఇక అన్నింటికంటే ముఖ్యంగా కోర్సులో చేరాక అది మీకు సూట్ అవ్వదు అనిపిస్తే సమయం వృథా చేయకుండా వెంటనే మరొక కెరీర్‌కు షిఫ్ట్ అవ్వడం మంచిది. అలాగే కెరీర్ నిర్ణయంలో పక్కవారితో పోలికలు కూడా కరెక్ట్ కాదు. కెరీర్ అనేది లైఫ్ లాంగ్ కొనసాగే విషయం కాబట్టి ఇతరులతో పోల్చుకోవడం సరికాదు.

First Published:  26 May 2024 3:45 AM GMT
Next Story