Telugu Global
NEWS

మాట నిలబెట్టుకుంటున్న ‘హను–మాన్‌’

హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్లు గట్టిగానే వసూలు చేసే అవకాశముంది. అంజనాద్రి అనే కల్పిత ప్రాంతం చుట్టూ అల్లుకున్న ఈ చిత్ర కథకు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వ ప్రతిభతో ప్రేక్షకులను మెప్పించాడు.

మాట నిలబెట్టుకుంటున్న ‘హను–మాన్‌’
X

ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా రూపొందించిన చిత్రం ‘హను–మాన్‌’. శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలి షో నుంచే హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్రం విడుదలకు ముందు నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిత్ర బృందం టికెట్‌కు రూ.5 చొప్పున అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

తాజాగా ఈ చిత్రం ప్రీమియర్‌ షోల ద్వారా వచ్చిన రూ.14.25 లక్షలను విరాళంగా అందిస్తున్నట్టు ఆ చిత్ర బృందం శుక్రవారం వెల్లడించింది. తద్వారా తన మాట నిలబెట్టుకుంది. ఇంకా ఈ చిత్రం ప్రదర్శితమైనంత కాలం ఈ విరాళం అందిస్తామని ఈ సందర్భంగా తెలిపింది. అంతేకాదు.. దీనికి సంబంధించి వెబ్‌సైట్‌ కూడా రూపొందించి ఆయా వివరాలు అందులో పొందుపరుస్తామని నిర్మాత నిరంజన్‌రెడ్డి వెల్లడించారు.

హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్లు గట్టిగానే వసూలు చేసే అవకాశముంది. అంజనాద్రి అనే కల్పిత ప్రాంతం చుట్టూ అల్లుకున్న ఈ చిత్ర కథకు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వ ప్రతిభతో ప్రేక్షకులను మెప్పించాడు. విజువల్స్, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. ఈ చిత్రంలో ‘కోటి’ అనే వానర పాత్రకు ప్రముఖ హీరో రవితేజ వాయిస్‌ ఓవర్‌ అందించడం విశేషం. అమృత అయ్యర్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌ కుమార్, వినయ్‌ రాయ్‌ కీలక పాత్రల్లో మెప్పించారు.

First Published:  13 Jan 2024 8:12 AM IST
Next Story