శాకాహారులకు గుడ్ న్యూస్.. జొమాటో ప్యూర్ వెజ్ ఫ్లీట్
ప్రస్తుతం జొమాటో యాప్‌లో అన్ని రెస్టారెంట్లు కలిపే ఉంటాయి. ఓన్లీ వెజ్ అనే ఆప్షన్ పెడితే వెజిటేరియన్ రెస్టారెంట్ల పేర్లు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు యాప్‌లోనే ప్యూర్ వెజ్ మోడ్ ఉంటుంది.
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టాలంటే ప్యూర్ వెజిటేరియన్స్‌కు ఒకటే చింత. నాన్ వెజ్ తగలకుండా మనకు సెపరేట్‌గా వండుతారా? విడిగా తెచ్చి ఇస్తారా? ఇప్పటి వరకయితే దీనికి సమాధానం నో. కానీ జొమాటో ఫస్ట్ టైం దీన్ని బ్రేక్ చేయబోతోంది. శాకాహారుల కోసం ప్యూర్ వెజ్ ఫ్లీట్ పేరుతో కొత్త ప్రయోగం చేయబోతోంది. వారి కోసం ప్రత్యేకంగా డెలివరీ బాయ్స్‌ను పెట్టి కేవలం శాకాహారమే మాత్రమే తెచ్చి అందించబోతోంది.
యాప్‌లో ప్యూర్ వెజ్ మోడ్
ప్రస్తుతం జొమాటో యాప్‌లో అన్ని రెస్టారెంట్లు కలిపే ఉంటాయి. ఓన్లీ వెజ్ అనే ఆప్షన్ పెడితే వెజిటేరియన్ రెస్టారెంట్ల పేర్లు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు యాప్‌లోనే ప్యూర్ వెజ్ మోడ్ ఉంటుంది. దీనిలో ప్యూర్ వెజ్ రెస్టారెంట్ల లిస్ట్ మాత్రమే ఉంటుంది. దానిలో నుంచి నేరుగా వెజ్ ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. నాన్‌వెజ్, వెజ్ ఐటమ్స్ ఒకరే డెలివరీ బాయ్ బ్యాగ్‌లో పెట్టి తెస్తే దానిలో ఏదైనా లీకయినా, నాన్ వెజ్ వాసన వచ్చినా ఇబ్బందిపడుతున్నామని శాకాహారులు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో వారి కోసం సెపరేట్ డెలివరీ బాయ్స్‌ను పెట్టి, వెజ్ ఫుడ్ అందించబోతున్నామని జొమాటో ప్రకటించింది.
డ్రెస్ కాదు వేరే అని.. తర్వాత మార్చింది
ప్యూర్ వెజ్ ఫ్లీట్ కోసం ప్రత్యేకంగా డెలివరీ బాయ్స్ ఉంటారన్న జొమాటో వారికి గ్రీన్ కలర్ యూనిఫామ్ ఇస్తామని నిన్న ప్రకటించింది. అయితే దీనిపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. వారికి కూడా రెగ్యులర్ రెడ్ యూనిఫామే ఉంటుందని చెప్పింది.