Telugu Global
NEWS

రూ.826 కోట్లతో కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఫ్లై ఓవర్లు.. అండర్‌ పాస్‌లు

ఈపీసీ పద్ధతిలో టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు

రూ.826 కోట్లతో కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఫ్లై ఓవర్లు.. అండర్‌ పాస్‌లు
X

కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఫ్లై ఓవర్లు, అండర్‌ పాస్‌ లు, రేడియల్‌ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. రూ.826 కోట్లతో ఇంజినీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కాంట్రాక్ట్‌ (ఈపీసీ) పద్ధతిలో ఈ పనులు చేయనుంది. కేబీఆర్‌ పార్క్‌ ఎంట్రన్స్‌ జంక్షన్‌, జూబ్లీ చెక్‌ పోస్ట్‌, రోడ్‌ నం.45 జంక్షన్‌, ఫిల్మ్‌ నగర్‌ జంక్షన్‌, అగ్రసేన్‌ మహరాజ జంక్షన్‌, క్యాన్సర్‌ హాస్పిటల్‌ జంక్షన్‌ లో ఈ ఫ్లై ఓవర్లు, అండర్‌ పాస్‌ ల నిర్మాణం చేపట్టనుంది. మొత్తం ఆరు జంక్షన్ల అభివృద్ధి, ఫ్లై ఓవర్లు, అండర్‌ పాస్‌ లను కనెక్ట్‌ చేసేలా రేడియల్‌ రోడ్లను నిర్మించనుంది. మొత్తం రెండు ప్యాకేజీలుగా ఈ పనులను విభజించి టెండర్లు పిలవడానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఎస్‌ఎన్‌డీపీలో భాగంగా 2015లో ఇవే జంక్షన్ల అభివృద్ధి, ఫ్లై ఓవర్ల నిర్మాణానికి రూ.586 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ పనుల కోసం పిలిచిన టెండర్లను రద్దు చేసింది. అప్పుడు ఎం/ఎస్‌ ఎం. వెంకటరావు ఇన్‌ ఫ్రా ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తో చేసుకున్న అగ్రిమెంట్‌ ను రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. హైదరాబాద్‌ లో అత్యధిక ట్రాఫిక్‌ ఉండే కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఈ జంక్షన్ల అభివృద్ధి, ఫ్లై ఓవర్లు, అండర్‌ పాస్‌ ల నిర్మాణంతో నగరం రూపురేఖలు మారుతాయని ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి.



First Published:  4 Oct 2024 12:28 PM GMT
Next Story