Telugu Global
NEWS

వాన గురించి ఈ విషయాలు తెలుసా?

వర్షపు నీటిలో ఆల్కలైన్ శాతం ఎక్కువ. ఇవి అత్యంత స్వచ్ఛమైన నీళ్లు. ఇవి అత్యంత తక్కువ బరువుతో ఉంటాయి. సగటు ఒక వర్షపు చినుకు బరువు 0.034 గ్రాములు ఉంటుదట. ఇది ఒక కనురెప్ప బరువు కంటే తక్కువ.

వాన గురించి ఈ విషయాలు తెలుసా?
X

తెలుగు రాష్ట్రాల్లో చాలా రోజుల తర్వాత మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. మానవుల మనుగడకు వాన ఎంతో ముఖ్యం. అలాగే వర్షం కొన్నిసార్లు విధ్వంసాన్ని కూడా సృష్టించలగదు. అయితే.. అసలీ వాన ఎలా పుడుతుంది? వర్షపు చినుకు బరువెంత ఉంటుంది? ఇలాంటి కొన్నిDo you know interesting facts about rain? ఇప్పుడు తెలుసుకుందాం.

మేఘాలలో దాగి ఉండే నీటి ఆవిరి వర్షంగా మారి నేలపై కురుస్తుందని అందరికీ తెలిసిందే. అయితే వర్షపు చినుకులు బిందువుల రూపంలో నేరుగా మబ్బుల నుంచి కిందకు రావు. మబ్బుల్లో ఉండే నీరు కరిగినప్పుడు ఒక పెద్ద బన్‌ ఆకారంలోకి మారుతుంది. పెద్ద బుడగలా ఏర్పడిన నీరు కిందకు వచ్చే కొద్దీ ఒక్కో బుడగ రెండుగా విడిపోతూ నేలకు చేరేసరికి మిల్లీ మీటర్ల వ్యాసార్థంలోని చినుకుల్లా మారతాయి.

ఎండకు ఆవిరైన భూమి మీది నీళ్లు కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి ఆకాశంలో మబ్బుల రూపంలో పోగయ్యి గాలి దిశను బట్టి వేలకిలోమీటర్లు ప్రయాణిస్తుంటాయి. వాతావరణంలోని మార్పులకు అనుగుణంగా తిరిగి చల్లబడి వానగా కురుస్తుంటాయి. వర్షపు నీటిలో ఆల్కలైన్ శాతం ఎక్కువ. ఇవి అత్యంత స్వచ్ఛమైన నీళ్లు. ఇవి అత్యంత తక్కువ బరువుతో ఉంటాయి. సగటు ఒక వర్షపు చినుకు బరువు 0.034 గ్రాములు ఉంటుదట. ఇది ఒక కనురెప్ప బరువు కంటే తక్కువ.

సగటు వర్షపు చినుకు గంటకు 22 కిలోమీటర్ల వేగంతో భూమి మీదకు పడుతుందట. పెద్ద చినుకులైతే 32 కిలోమీటర్ల వేగంతో కూడా పడతాయి. వడగండ్ల వేగం ఇంకా ఎక్కువ. ఒక్కో వర్షపు చుక్క భూమిని చేరుకోవడానికి దాదాపు రెండు నిమిషాలు పడుతుందట. మేఘాల ఎత్తును బట్టి ఈ టైం మారుతుండొచ్చు. అయితే మేఘం నుంచి కురిసే ప్రతి చినుకు భూమి వరకూ చేరదట. చినుకులుగా విడిపోయే క్రమంలో కొన్ని వర్షపు చినుకులు భూమిపై పడేలోపే మళ్లీ తిరిగి ఆవిరైపోతాయి.

వర్షం కురిసేటప్పుడు మట్టి వాసన వస్తుంది. అయితే ఇది మట్టి నుంచి వచ్చే వాసనే తప్ప వర్షపు నీటికి ఎలాంటి వాసన ఉండదు. స్వచ్చమైన నీరు భూమిపై అంతటా ఒకేసారి పడడంతో మట్టి రేణువులు గాలిలోకి లేచి మట్టి వాసనను వ్యాప్తి చేస్తాయి.

మీకు తెలుసా వర్షపు నీటిలో కొద్ది శాతంలో విటమిన్‌ బీ12 ఉంటుందట. గాలిలో సహజంగా ఉండే కొన్ని సూక్ష్మజీవులు వర్షపు నీటితో కలిసి విటమిన్‌ బీ12ను ఉత్పత్తి చేస్తాయట. ఇప్పటివరకూ భూమిపై అత్యధికంగా కురిసిన వర్షం నిమిషానికి 31.2 మిల్లీమీటర్లు. ఇది 1956 జూలై 4న అమెరికా మేరీల్యాండ్‌లో నమోదైంది. మనదేశంలో అయితే.. మేఘాలయలోని మాసిన్రామ్‌లో 2022 జూన్‌ 17న ఒక రోజుకి 1003.6 మిల్లీమీటర్ల అత్యధిక వర్షం కురిసింది. అంతేకాదు, మేఘాలయలోని చిరపుంజిలో ఏడాది పొడవునా వర్షం కురుస్తూనే ఉంటుంది. భూమిపై అత్యంత తడి ప్రదేశంగా దీనికి పేరుంది. ఇకపోతే భూమిపై అస్సలు వర్షమే పడని ప్రాంతం అంటార్కిటికా. ఇక్కడ ఏడాదిలో ఒక్క చినుకు కూడా భూమిపై పడదు. ధృవానికి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ వర్షం అనేది ఉండదు.


First Published:  5 Sept 2023 4:47 PM IST
Next Story