'జై హనుమాన్'లో ఆంజనేయుడిగా స్టార్ హీరో
సీక్వెల్ లో తేజ సజ్జ హీరో కాదని తెలిపాడు. రెండో భాగంలోనూ తేజ హనుమంతు పాత్రలో నటిస్తాడని, కానీ ఈ సినిమాలో ఆంజనేయ స్వామి పాత్రే ప్రధానంగా ఉంటుందన్నాడు.
తేజ సజ్జ- ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన హనుమాన్ సినిమా దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం విడుదలైన పది రోజుల్లోనే ఈ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సాధించి ఈ ఏడాది ఇండియాలోనే తొలి 200 కోట్ల కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. హనుమాన్ సినిమాకు కొనసాగింపుగా 'జై హనుమాన్' మూవీ ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా జై హనుమాన్ చిత్ర విశేషాలను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వెల్లడించాడు. హనుమాన్ సక్సెస్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలను తెలిపాడు. 'జై హనుమాన్' ను హనుమాన్ తో పోలిస్తే భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లు చెప్పాడు. సీక్వెల్ లో తేజ సజ్జ హీరో కాదని తెలిపాడు. రెండో భాగంలోనూ తేజ హనుమంతు పాత్రలో నటిస్తాడని, కానీ ఈ సినిమాలో ఆంజనేయ స్వామి పాత్రే ప్రధానంగా ఉంటుందన్నాడు.
ఈ పాత్రను ఒక స్టార్ హీరో పోషిస్తారని ప్రశాంత్ వర్మ వెల్లడించాడు. హనుమాన్ ట్రైలర్ లో చూపే దేవుడి కళ్ళు చిరంజీవి కళ్ళు పోలి ఉన్నట్లు ప్రమోషన్స్ సమయంలో మీడియా ప్రతినిధులు ప్రశాంత్ వర్మను ప్రశ్నించారు. ఇందులో చిరంజీవి నటిస్తున్నారా? అని అడిగారు. అయితే దీనికి ప్రశాంత్ వర్మ సమాధానం చెప్పకుండా.. సస్పెన్స్.. అని దాటవేశాడు.
ఈ నేపథ్యంలో హనుమాన్ సీక్వెల్లో చిరంజీవి నటిస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే రాముడి పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తారని కూడా హనుమాన్ విడుదలైనప్పటి నుంచి వార్తలు వస్తున్నాయి. మొత్తానికి సీక్వెల్లో ఒక స్టార్ హీరో నటిస్తాడని మాత్రమే చెప్పి ఆయనెవరో చెప్పకుండా ప్రశాంత్ వర్మ సస్పెన్స్ లో ఉంచాడు.