Telugu Global
NEWS

కమ్యూనిస్టు దిగ్గజం సీతారాం ఏచూరి కన్నుమూత

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) తుది శ్వాస విడిచారు.

కమ్యూనిస్టు దిగ్గజం సీతారాం ఏచూరి కన్నుమూత
X

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో కొద్ది వారాలుగా ఆయన డిల్లీ లోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో గురువారం ఏచూరి ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు. సీతారాం ఏచూరి తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆగస్టు 19న ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఆయన 25 రోజులుగా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 72 ఏళ్ల ఏచూరికి ఇటీవల క్యాటరాక్ట్ ఆపరేషన్ కూడా జరిగింది. డాక్టర్‌ శ్రీనాథ్‌ రెడ్డి, డాక్టర్‌ గౌరి నేతృత్వంలోని డాక్టర్ల బృందం ఆయనకు ట్రీట్మెంట్ ను అందించింది. అయితే ఇన్‌ఫెక్షన్‌ తొలగించేందుకు ఉపయోగించిన మెడిసన్స్ కు ఆయన స్పందించకపోవడంతో జపాన్‌ నుంచి ప్రత్యేక మందులు కూడా తెప్పించారు. ఈక్రమంలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. దీంతో కమ్యూనిస్ట్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త, కాలమిస్ట్‌గా గుర్తింపు పొందిన ఏచూరి 1992 నుంచి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.

సీతారాం ఏచూరి ఆగష్టు 12, 1952 న మద్రాస్ లో జన్మించారు. అయితే ఏచూరి చిన్నతనం అంతా హైదరాబాద్ లోనే గడిచింది. ఏచూరి తండ్రి సోమయాజుల ఏచూరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ కార్పొరేషన్ లో ఇంజినీర్. తల్లి కల్పకం ఏచూరి ప్రభుత్వ అధికారి. ఆల్ సెయింట్స్ హైస్కూల్ లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. తర్వాత ఢిల్లి వెళ్లి ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్ లో చేరారు. సీబీఎస్సీ హయ్యర్ సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకర్ గా నిలిచిన ఏచూరి ఆర్థిక శాస్త్రంలో బీఏ పూర్తి చేశారు. జేఎన్ యూ నుంచి ఎంఏ పట్టా తీసుకున్నారు. అక్కడే పీఎచ్డీలో చేరారు. కానీ ఎమర్జెన్సీ సయయంలో అరెస్టు అవ్వడంతో పీఎచ్డీ కొనసాగించలేకపోయారు. సీతారాం ఏచూరి రెండు వివాహాలు చేసుకున్నారు. మొదటి భార్య ముజుందార్ కాగా.. జర్నలిస్టు సీమా చిత్తీని రెండో వివాహం చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు పిల్లలు




విద్యార్థి నేతగా రాజకీయాల్లోకి..

  • 1974లో ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి నేతగా సీతారాం ఏచూరి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు.
  • 1975లో జేఎన్‌యూ విద్యార్థిగా ఉన్నప్పుడు సీపీఎంలో జాయిన్ అయ్యారు.
  • ఎమర్జెన్సీ సమయంలో ఏచూరి కూడా అరెస్టు అయిన వారిలో ఉన్నారు.
  • జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్‌కు మూడుసార్లు ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు.
  • సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరాత్‌తో కలిసి జేఎన్‌యూను వామపక్ష కోటగా మార్చారు.
  • ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా కూడా ఏచూరి పనిచేశారు.
  • 1984లో సీపీఎం కేంద్ర కమిటీలో చేరిన ఆయన 1992లో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎన్నిక అయ్యారు.
  • 2005లో పశ్చిమ బెంగాల్ నుంచి తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు.
  • 2015లో విశాఖపట్నంలో జరిగిన 21వ సీపీఎం మహాసభల్లో పార్టీ ఐదో ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. అప్పటినుంచి ఏచూరి ఆ పదవిలో కొనసాగుతున్నారు.
  • 2004లో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణంలోనూ కీలకంగా వ్యవహరించారు.
  • ఏచూరికి రచయితగానూ మంచి గుర్తింపు పొందారు.
  • ‘లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్’ పేరిట ఓ ఇంగ్లీష్ పేపర్ కు కాలమ్స్‌ రాశారు.
  • ‘క్యాస్ట్‌ అండ్‌ క్లాస్‌ ఇన్‌ ఇండియన్‌ పాలిటిక్స్‌ టుడే’, ‘సోషలిజం ఇన్‌ ఛేంజింగ్‌ వరల్డ్‌’, ‘మోదీ గవర్నమెంట్‌: న్యూ సర్జ్‌ ఆఫ్‌ కమ్యూనలిజం’, ‘కమ్యూనలిజం వర్సెస్‌ సెక్యులరిజం’ వంటి పుస్తకాలు ఏచూరి కలం నుంచి వచ్చాయి.
First Published:  12 Sept 2024 4:40 PM IST
Next Story