మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. మహారాష్ట్రలో ఇప్పటివరకు 45 శాతానికి పైగా ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. నేటి సాయంత్రం ఎగ్జిట్‌పోల్స్ వెలువడనున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎగ్జిట్‌పోల్స్ చర్చల్లో తాము పాల్గొనడం లేదంటూ పార్టీ సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 288 నియోజకవర్గాలున్న మహారాష్ట్రలో ఒకే విడతలో పోలింగ్ కొనసాగుతున్నది. మధ్యాహ్నం 2-3 గంటల వరకు 43.53 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు ఝార్ఖండ్‌లో 61.47 శాతం ఓటింగ్ జరిగింది. ఓటు హక్కును వినియోగించుకోవడానికి సినీ, క్రీడా సెలబ్రిటీలతో పాటు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు.
Previous Articleముంబైలో కొనసాగుతున్న పోలింగ్.. ఓటేసిన నటి రకుల్‌ప్రీత్ సింగ్
Next Article సీఎం చంద్రబాబుకు కొత్త పేరు పెట్టిన జగన్
Keep Reading
Add A Comment