జగన్ తో సెల్ఫీ.. కానిస్టేబుల్ కు మెమో
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో సెల్ఫీ తీసుకున్న మహిళా కానిస్టేబుల్ కు అధికారులు ఛార్జి మెమో ఇవ్వనున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో సెల్ఫీ తీసుకున్న మహిళా కానిస్టేబుల్ అయేషాబానుకు ఛార్జి మెమో ఇవ్వనున్నట్టు జైలర్ రవిబాబు తెలిపారు. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గుంటూరు జైలులో రిమాండ్ లో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను పరామర్శించేందుకు బుధవారం వైఎస్ జగన్ వెళ్లారు. పరామర్శ తర్వాత బయట మీడియాతో జగన్ మాట్లాడారు. ఆ సమయంలో అదే జైలులో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ తన కుమార్తెతో కలిసి వచ్చారు. తమకు జగన్ అంటే అభిమానమని.. ఒక సెల్ఫీ తీసుకుంటామని కోరారు. అందుకు జగన్ కూడా అంగీకరంచడంతో నవ్వూతు సెల్ఫీ తీసుకున్నారు. అయితే ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయతే డ్యూటీ ఉన్న సమయంలో ఆమె అలా వ్యవహరించడంపై ఉన్నతస్థాయి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కానిస్టేబుల్ ఆమేషా బానుకు ఛార్జి మెమో ఇవ్వనున్నట్టు తెలిపారు.
అయతే ఈ అంశంపై వైసీపీ ఆరోపణలు చేసింది. జగన్ తో సెల్ఫీ తీసుకున్న కానిస్టేబుల్ కు మెమో ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగులను వేధించడంలో మీకు ఇదేం రాక్షస ఆనందం అంటూ ఏపీ సీఎం చంద్రబాబు, హోంమంత్రి వంగలపూడి అనితలపై వైసీపీ నేతలు మండిపడ్డారు.