Telugu Global
NEWS

జ‌మిలికి జై..! కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

'ఒక దేశం- ఒకే ఎన్నికలు' విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

జ‌మిలికి జై..! కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
X

'ఒక దేశం- ఒకే ఎన్నికలు' విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో ఒకేసారి ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వరంలోని కమిటీ రూపొందించిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నివేదికను సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులతో సమా 32 పార్టీల ప్రముఖ న్యాయవాదులు సమర్థించారు.

జమిలి ఎన్నికల ద్వారా ఎన్నికల ప్రక్రియ సులభతరం అవుతుందని కమిటీ తెలిపింది. లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీ, పంచాయితీలకు మూడు స్థాయిల్లో ఎన్నికలు నిర్వహించడం వల్ల వలస కార్మికులు ఓట్లు వేయడం కోసం పలుమాల్లు తమ ప్రాంతాలకు వెళ్లడం వల్ల, ఉత్పత్తిలో అంతరాయం కలుగుతుందని వెల్లడించింది. ఈ సమస్యను నివారించాలంటే ఒకే దేశం – ఒకే ఎన్నిక ఏకైక మార్గమని పేర్కొంది.

ఈ జమిలీ ఎన్నికల ప్రతిపాదన 1980లోనే వచ్చింది. జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ మే 1999లో తన 170 వ నివేదికలో లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరగాలని అభిప్రాయపడింది. అందుకు తగినట్లే కేంద్రంలోని బీజేపీ సర్కార్ అధ్యయనానికి కమిటీ వేసింది. అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను తీసుకుని, సుదీర్ఘ చర్చలు జరిపి కమిటీ నివేదిక తయారు చేసింది.

ప్రజలు అంగీకరించరు

మరోవైపు జమిలి ఎన్నికల విధానాన్ని కాంగ్రెస్‌తో సహా 15 పార్టీలు వ్యతిరేకించాయి. ఈ ప్రతిపాదన ఆచరణాత్మకమైనది కాదని కాంగ్రెస్ పేర్కొంది. ఇది ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని.. దీనిని ప్రజలు అంగీకరించరని కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే తెలిపారు.

First Published:  18 Sept 2024 7:34 PM IST
Next Story