బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌కు కౌంట్ డౌన్ షురువయ్యింది. మెల్ బోర్న్ వేదికగా గురువారం ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో యసశ్వీ జైస్వాల్ తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మనే ఇన్నింగ్స్ ఆరంభించబోతున్నారు. ఫస్ట్ డౌన్లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ కు వచ్చే అవకాశముంది. హిట్ మ్యానే ఈ హింట్ ఇచ్చారు. సిరీస్‌లో ఫస్ట్ టెస్ట్ (పెర్త్ టెస్ట్)కు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో యసశ్వీతో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. రెండో టెస్ట్ మ్యాచ్ నాటికి రోహిత్ శర్మతో టీమ్ తో జాయిన్ అయినా అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టు మ్యాచుల్లో ఓపెనింగ్ జోడిని మార్చకుండా తానే మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేశారు. బాక్సింగ్ డే టెస్ట్‌తో మళ్లీ ఇన్నింగ్స్ ఆరంభించాలని రోహిత్ నిర్ణయించారు. ఒక వేళ ఫస్ట్ డౌన్లో కాకుంటే కేఎల్ రాహుల్ ఆరో నంబర్ (ఫోర్త్ డౌన్)లో బ్యాటింగ్ కు వచ్చే అవకాశముంది. ఈ సిరీస్‌లో రాహుల్ మంచి ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఆడిన రెండు మ్యాచుల్లోనూ రోహిత్ శర్మ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. అయినా కెప్టెన్ కోసం టీమ్ మేనేజ్మెంట్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతుంది.
Previous Articleప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
Next Article క్రిస్మస్ సందర్భంగా కేసీఆర్ ప్రత్యేక ప్రార్థనలు
Keep Reading
Add A Comment