Telugu Global
NEWS

ఎవరీ పిచ్చోడు.. బాలయ్యపై ప్రముఖుల విమర్శలు

బాలీవుడ్ యాక్టర్ నకుల్ మెహతా సైతం ఈ వీడియో స్పందించారు. బాలయ్య ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేసిన ఆయన ఇలాంటి చర్యలను ఏ మాత్రం సహించకూడదన్నారు.

ఎవరీ పిచ్చోడు.. బాలయ్యపై ప్రముఖుల విమర్శలు
X

టాలీవుడ్‌ సీనియర్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సోషల్‌మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. విశ్వక్‌సేన్‌, నేహా శెట్టి హీరో, హీరోయిన్‌గా నటించిన గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన బాలకృష్ణ మరో హీరోయిన్‌ అంజలిని తోసేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో బాలయ్య తీరుపై నెటిజన్లతో పాటు పలువురు ప్రముఖులు మండిపడుతున్నారు.




బాలయ్య ప్రవర్తనపై తాజాగా స్పందించారు బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు హన్సల్ మెహతా. స్కామ్1992, ఛల్, షాహిద్, సిటీలైట్స్, అలీఘర్ లాంటి చిత్రాలతో తనకంటూ ఓ పేరు సంపాదించుకున్న మెహతా.. బాలకృష్ణ తీరుపై ఘాటుగా స్పందించారు. ఎవరీ పిచ్చోడు అంటూ ట్విట్టర్‌ వేదికగా పోస్టు పెట్టారు. ప్రస్తుతం హన్సల్ మెహతా ట్వీట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.


బాలీవుడ్ యాక్టర్ నకుల్ మెహతా సైతం ఈ వీడియో స్పందించారు. బాలయ్య ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేసిన ఆయన ఇలాంటి చర్యలను ఏ మాత్రం సహించకూడదన్నారు. చట్టసభల్లో ఉన్న వ్యక్తిగా మహిళలను ఎలా గౌరవించాలో తెలియని మనిషంటూ బాలయ్యపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి చర్యలు చూసినప్పటికీ బాలయ్యను వెనకేసుకొచ్చే వారున్నారంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య అలా చేస్తుంటే నవ్వడమేంటని పలువురు అంజలిని సైతం తప్పుపడుతున్నారు.

First Published:  31 May 2024 8:26 AM GMT
Next Story