బాలీవుడ్ నటి పూనమ్ పాండే మృతి.. కారణం తెలిస్తే..
పూనమ్ పాండే సినిమాల కంటే ఎక్కువగా తాను చేసే వివాదాస్పద వ్యాఖ్యలతోనే పబ్లిసిటీ పొందుతూ వచ్చారు. గతంలో భారత్ వన్డే ప్రపంచ కప్ గెలిస్తే నగ్నంగా స్టేడియంలోకి వస్తానని ప్రకటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు.
బాలీవుడ్ నటి, పోర్న్ స్టార్ పూనమ్ పాండే చనిపోయారు. 31 ఏళ్ల పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్‌తో మృతి చెందారు. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టుతో విషయం బయటకు వచ్చింది. ఇప్పుడీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది . 31ఏళ్ల వయసులోనే పూనమ్ పాండే చనిపోవడంతో అంతా షాక్ అవుతున్నారు. పూనమ్ మృతిపై బాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
పూనమ్ పాండేకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. 2013లో నషా సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అందాల ఆరబోతతో కుర్రకారను ఓ ఊపు ఊపింది. అలాగే అనేక వివాదాలకు కేరాఫ్‌గా మారింది. పూనమ్ పాండే సినిమాల కంటే ఎక్కువగా తాను చేసే వివాదాస్పద వ్యాఖ్యలతోనే పబ్లిసిటీ పొందుతూ వచ్చారు. గతంలో భారత్ వన్డే ప్రపంచ కప్ గెలిస్తే నగ్నంగా స్టేడియంలోకి వస్తానని ప్రకటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాగే భర్తపైనే పోలీస్ కేసు పెట్టి మరోసారి వార్తల్లో నిలిచారు. మొన్నటికి మొన్న లక్షద్వీప్‌లో ఫొటోషూట్ చేస్తానని చెప్పి మళ్లీ క్యాన్సిల్ చేసుకుని హాట్‌టాపిక్ అయ్యారు.
తాజాగా పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్‌తో మృతి చెందారన్న వార్తను ఆమె అభిమానులు నమ్మలేకపోతున్నారు. ఏటా 80వేల మంది గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇందులో 35వేల మంది చనిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ తరుణంలో క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. నిన్ననే నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గర్భాశయ క్యాన్సర్ పై వ్యాక్సినేషన్ డ్రైవ్ చేస్తామని ప్రకటించారు. కేంద్రమంత్రి నిర్మల ప్రకటన చేసి 24 గంటలు గడవకముందే పూనమ్ పాండే అదే గర్భాశయ క్యాన్సర్‌తో తుదిశ్వాస విడిచారు.