రెండు హిట్లతో సక్సెస్ ట్రాక్‌లోకి బాలీవుడ్
చాలా నెలల తర్వాత బాలీవుడ్‌కు వరుసగా రెండు విజయాలు దక్కాయి. వరుస పరాజయాలతో ఢీలాపడ్డ బాలీవుడ్‌కు ఈ విజయాలు కొంత అయినా ఉపశమనం అందిస్తున్నాయి.
కొన్ని నెలలుగా బాలీవుడ్‌లో బ్యాడ్ టైం నడుస్తున్న సంగతి తెలిసిందే. అగ్ర హీరోలు నటిస్తున్న సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, రణ్ బీర్ కపూర్ వంటి అగ్ర హీరోలు నటించిన సినిమాలు కూడా పరాజయం పాలయ్యాయి. మరోవైపు సౌత్ నుంచి వస్తున్న సినిమాలు మాత్రం అక్కడ సంచలన విజయం సాధిస్తున్నాయి. దీంతో బాలీవుడ్ తీవ్ర నిరాశలో కూరుకుపోయింది.
ఈ ఏడాది సౌత్ నుంచి వచ్చిన సినిమాల్లో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, కార్తికేయ 2, కాంతారా అద్భుత విజయాలు సాధించగా .. బాలీవుడ్‌లో నిర్మితమైన ఏ ఒక్క సినిమా కూడా ఈ రేంజ్‌లో విజయం సాధించలేదు. కొన్ని నెలలుగా వరుస పరాజయాల్లో చిక్కుకుపోయిన బాలీవుడ్‌కు ఇప్పుడు రెండు వరుస హిట్లు కాస్త ఊరట ఇస్తున్నాయి.
మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించి సూపర్ హిట్‌గా నిలిచిన సినిమా దృశ్యం-2. ఈ సినిమా తెలుగులో కూడా అదే టైటిల్‌తో రీమేక్ అయి విజయం సాధించగా.. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా ఇదే టైటిల్‌తో రీమేక్ అయ్యింది. ఇందులో అజయ్ దేవగణ్, శ్రీయ జంటగా నటించారు. ఈ సినిమా బాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ విడుదలైన 13 రోజుల్లోనే రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ వీకెండ్ కల్లా ఈ మూవీ రూ. 200 కోట్ల క్లబ్‌లోకి చేరుకుంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ సినిమా ఇలా భారీ విజయం దిశగా దూసుకుపోతుండగా తాజాగా విడుదలైన భేదియా సినిమాకు కూడా హిట్ టాక్ వచ్చింది. వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన ఈ సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే రూ. 40 కోట్ల వసూళ్లు సాధించింది. వీక్ డేస్‌లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది. దీంతో చాలా నెలల తర్వాత బాలీవుడ్‌కు వరుసగా రెండు విజయాలు దక్కాయి. వరుస పరాజయాలతో ఢీలాపడ్డ బాలీవుడ్‌కు ఈ విజయాలు కొంత అయినా ఉపశమనం అందిస్తున్నాయి.