Telugu Global
NEWS

రేవ్‌ పార్టీ కేసు.. నటి హేమ అరెస్టు

ఈ ఇష్యూను సీరియస్‌గా తీసుకున్న బెంగళూరు పోలీసులు.. హేమకు మరోసారి నోటీసులిచ్చేందుకు సిద్ధమవ్వగా ఇవాళ హేమ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం హేమను అరెస్టు చేశారు పోలీసులు.

రేవ్‌ పార్టీ కేసు.. నటి హేమ అరెస్టు
X

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సినీ నటి హేమను బెంగళూరు పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. రేపు బెంగళూరులోని కోర్టులో హేమను హాజరు పరిచే అవకాశాలున్నాయి.

రేవ్ పార్టీలో డ్రగ్స్‌ తీసుకున్నట్లు తేలడంతో మే 27న హేమకు నోటీసులు జారీ చేశారు బెంగళూరు పోలీసులు. అయితే వైరల్‌‌ ఫీవర్ కారణంగా విచారణకు హాజరుకాలేనని, బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు లెటర్ రాశారు హేమ. అయితే హేమ లెటర్‌ను పరిగణలోకి తీసుకోని పోలీసులు.. మరోసారి నోటీసులు జారీ చేశారు. జూన్ 1న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఐనప్పటికీ హేమ విచారణకు హాజరుకాలేదు. దీంతో ఈ ఇష్యూను సీరియస్‌గా తీసుకున్న బెంగళూరు పోలీసులు.. హేమకు మరోసారి నోటీసులిచ్చేందుకు సిద్ధమవ్వగా ఇవాళ హేమ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం హేమను అరెస్టు చేశారు పోలీసులు.

మే19న బెంగళూరు శివారులోని ఎలక్ట్రానిక్స్‌ సిటీ సమీపంలోని GR ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీ జరిగిన విషయం తెలిసిందే. లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డ్రగ్స్ వాడకంతో పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యూసెన్స్ చేస్తున్నారన్న పక్కా సమాచారంతో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులు మే 20వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో దాడులు చేశారు. మొత్తం ఈ పార్టీలో 100 మందికిపైగా పాల్గొన్నట్లు గుర్తించగా.. 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. వీరిలో నటి హేమ కూడా ఉన్నారు.

First Published:  3 Jun 2024 5:30 PM IST
Next Story