వైసీపీ కి షాక్.. జనసేనలోకి బాలినేని?
వైఎస్సార్సీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీ ముఖ్యనేత బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.
వైఎస్సార్సీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీ ముఖ్యనేత బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన అధినేత వైఎస్ జగన్ కు రాజీనామా లేఖను మొయిల్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి విధానాలు నచ్చకపోవడం వల్లే పార్టీని వీడుతున్నట్టు ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
కొంతకాలంగా వైసీపీ తీరుపై అసంతృప్తిగా ఉన్న బాలిరెడ్డి.. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. ఇటీవల వైఎస్ జగన్ తో సమావేశమైన తర్వాత కూడా అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు బాలిరెడ్డి గురువారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో భేటీ కానున్నారు. అనంతరం జనసేన లో చేరే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక ఓంగోలు అసెంబ్లీ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి 1999, 2004, 2009, 2012 లో పోటీ చేసి విజయం సాధించారు. 2012 లో వైసీపీలో చేరిన ఆయన 2014 లో ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2019లో మళ్లీ బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి జనార్థన రావును ఓడించారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కింది. రెండేళ్లు మంత్రిగా ఉన్న బాలిరెడ్డి 2023 లో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో పదవి కోల్పోవాల్సి వచ్చింది. అప్పటినుంచి పార్టీ నాయకత్వంలో విబేధాలు ఉన్నాయి. బహిరంగంగా విమర్శలు చేస్తూ వచ్చారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బాలిరెడ్డి వైసీపీని వీడతారనే ప్రచారం జరిగినా.. తాజాగా ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు.