Telugu Global
NEWS

అమెజాన్‌ అతిపెద్ద సేల్‌ వచ్చేస్తోంది

ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అతిపెద్ద సేల్‌ త్వరలో రాబోతోంది.

Amazon Great Indian Festival | అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్‌లో లాప్‌టాప్‌ల‌పై బెస్ట్ ఆఫ‌ర్లు ఇవే..!
X

ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అతిపెద్ద సేల్‌ త్వరలో రాబోతోంది. ప్రతి ఏటా నిర్వహించే అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ను సెప్టెంబర్‌ 27న నిర్వహించనుంది. ఇక ప్రైమ్‌ మెంబర్స్ కోసం 24 గంటల ముందే.. అంటే సెప్టెంబర్‌ 26 నుంచే ఈ సేల్‌ అందుబాటులోకి రానుంది. మరోవైపు మరో ఇ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కూడా సెప్టెంబర్ 27 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ డేస్‌ సేల్‌ నిర్వహించేందుకు రెడీ అవుతోంది.

ఇక ఈసారి సేల్‌లో ఎస్‌బీఐ కార్డు యూజర్లకు మంచి డిస్కౌంట్‌ లభించనుంది. క్రెడిట్‌ కార్డు, డెబిట్ కార్డుతో చేసే కొనుగోళ్లపై 10 శాతం తగ్గింపు పొందొచ్చు. అమెజాన్‌ పే యూపీఐతో చేసే రూ.1000 పైన కొనుగోళ్లపై రూ.100 డిస్కౌంట్‌ అందించనున్నట్లు అమెజాన్ తెలిపింది. సేల్‌లో భాగంగా మొబైల్స్‌పై 40 శాతం, ఎలక్ట్రానిక్స్‌పై 75 శాతం, గృహోపకరణాలపై 50 శాతం, ఫ్యాషన్‌ ప్రొడెక్డ్స్ పై 50 నుంచి 80 శాతం, అమెజాన్ అలెక్సా ఉత్పత్తులపై 55 శాతం డిస్కౌంట్‌ లభించనుంది. అయితే దేనిపై ఎంత డిస్కౌంట్‌ ఇచ్చేది మాత్రం వెల్లడించలేదు.

మరోవైనపు గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో భాగంగా రూ.5,999 నుంచే మొబైల్స్‌ లభిస్తాయని అమెజాన్‌ తెలిపింది.రూ. 89 నుంచే మొబైల్‌ యాక్సెసరీస్‌ ప్రారంభమవుతాయని పేర్కొంది. 24నెలల నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది. స్మార్ట్‌టీవీల ధరలు కూడా రూ.6,999 నుంచే ప్రారంభమవుతాయని తెలిపింది. అమెజాన్‌ అలెక్సా, ఫైర్‌టీవీ స్టిక్‌ డివైజులు రూ.1,999 నుంచి లభించనున్నాయి. ఇక సేల్‌ సమయంలో ట్రావెల్‌ బుకింగ్‌లపైనా డిస్కౌంట్‌ పొందే అవకాశం ఉందని అమెజాన్‌ పేర్కొంది. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లతో పాటు కూపన్లు కూడా జారీ చేయనున్నట్లు తెలిపింది. త్వరలో గ్రేట్ ఇండియన్ సేల్ ఆఫర్ల వివరాలు వెల్లడి కానున్నాయి.

First Published:  16 Sep 2024 1:23 PM GMT
Next Story