Telugu Global
NEWS

Alia Bhatt: ఆడబిడ్డకు జన్మనిచ్చిన అలియా భట్

అలియా భట్ తల్లిగా మారడంతో కపూర్ ఫ్యామిలీలో సంబరాలు నెలకొన్నాయి. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు కపూర్ కుటుంబ సభ్యులు తెలిపారు.

Alia Bhatt: ఆడబిడ్డకు జన్మనిచ్చిన అలియా భట్
X

బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ బీర్ కపూర్ - అలియా భట్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. అలియా భట్ ఇవాళ మధ్యాహ్నం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ రోజు ఉదయం అలియా భట్ డెలివరీ కోసం ముంబైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. కొన్ని గంటల కిందట ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అలియా భట్ తల్లిగా మారడంతో కపూర్ ఫ్యామిలీలో సంబరాలు నెలకొన్నాయి. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు కపూర్ కుటుంబ సభ్యులు తెలిపారు.

కాగా ఆసుపత్రిలో అలియా భట్ వెంట భర్త రణ్ బీర్ కపూర్, నీతూ కపూర్, సోనీ రజ్దాన్ ఉన్నారు. ఈ ఏడాది జూన్‌లో తాము తల్లిదండ్రులుగా మారబోతున్నట్లు అలియా భట్ దంపతులు ప్రకటించారు. ఆ సందర్భంగా హాస్పిటల్‌లో స్కానింగ్ చేస్తున్న ఫొటోను కూడా షేర్ చేశారు. రణ్ బీర్ - అలియా భట్ కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 2022 ఏప్రిల్ 14న వివాహ బంధంతో రణ్ బీర్ - అలియా భట్ ఒక్కటయ్యారు.

ఈ ఏడాది రణ్ బీర్ - అలియా భట్ జంటగా బ్రహ్మాస్త్ర అనే సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. గర్భిణిగానే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న అలియా భట్ ఆ తర్వాత దేశవ్యాప్తంగా తిరుగుతూ ప్రమోషన్స్ చేపట్టింది. కాగా తల్లిదండ్రులైన రణ్ బీర్ - అలియా భట్ దంపతులకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే సోషల్ మీడియా వేదికగా రణ్ బీర్ - అలియా ఫ్యాన్స్ విషెస్ చెప్పారు.

First Published:  6 Nov 2022 5:01 PM IST
Next Story