Telugu Global
NEWS

మరోసారి డీప్ ఫేక్ బారిన రష్మిక మందన్న

ఈ గోల కంటిన్యూ అవుతూనే ఉంది. రష్మిక డీప్ ఫేక్ వీడియో వచ్చిన తర్వాత మళ్లీ వెంటనే ఆమెకు సంబంధించిన వీడియోలే మళ్లీ మళ్లీ వచ్చాయి.

మరోసారి డీప్ ఫేక్ బారిన రష్మిక మందన్న
X

ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న మరోసారి డీప్ ఫేక్ బారిన పడింది. ప్రముఖ కొలంబియా మోడల్ డానియోలా విల్లారియల్ ఇన్‌స్టా రీల్‌ను ఎడిట్ చేసి ఈ వీడియోను రూపొందించారు. ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోల తలనొప్పి ఎక్కువైంది. ముఖ్యంగా సెలబ్రిటీలు పెద్ద సంఖ్యలో డీప్ ఫేక్ బారిన పడుతున్నారు.

మొదటిసారి హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో బయటికి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా దీనిపై పెద్ద చర్చే జరిగింది. ఆ తర్వాత నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

అయినప్పటికీ ఈ గోల కంటిన్యూ అవుతూనే ఉంది. రష్మిక డీప్ ఫేక్ వీడియో వచ్చిన తర్వాత మళ్లీ వెంటనే ఆమెకు సంబంధించిన వీడియోలే మళ్లీ మళ్లీ వచ్చాయి. హీరోయిన్లు కత్రినా కైఫ్, ఆలియా భట్, కాజోల్, ప్రియాంక చోప్రా, నోరా ఫతేహిలతో పాటు సచిన్ టెండూల్కర్, అమీర్ ఖాన్, రణ్వీర్ సింగ్ తదితరులు డీప్ ఫేక్ బారినపడ్డారు.

ఇప్పుడు రష్మిక మందన్న మరోసారి డీప్ ఫేక్ బారిన పడింది. మోడల్ డానియోలా ఇన్ స్టాగ్రామ్ రీల్ ను ఎడిట్ చేసి ఈ వీడియోను రూపొందించారు. మొదటిసారి వచ్చిన రష్మిక డీప్ ఫేక్ వీడియో కంటే ఈ వీడియో మరింత అసభ్యకరంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రష్మిక డీప్ ఫేక్ బారిన పడిన సమయంలో అప్పట్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోపై రష్మిక ఇంకా స్పందించలేదు. రష్మిక ఇప్పటికే నాలుగైదు సార్లు డీప్ ఫేక్ బారిన పడటం చర్చనీయాంశమైంది.

First Published:  28 May 2024 6:59 PM IST
Next Story