మలుపు తిరిగిన రేవ్ పార్టీ కేసు.. నటి హేమకు షాక్
కొన్నిరోజుల క్రితం ఓ రేంజ్ లో హడావిడి చేసిన బెంగళూరు రేవ్ పార్టీ కేసు కీలక మలుపు తిరిగింది.
కొన్నిరోజుల క్రితం ఓ రేంజ్ లో హడావిడి చేసిన బెంగళూరు రేవ్ పార్టీ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. టాలీవుడ్ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు నివేదికలో పేర్కొన్న పోలీసులు MDMA మెడికల్ రిపోర్ట్‌ను కూడా యాడ్ చేశారు. ఈ కేసులో హేమతో పాటు 88 మంది డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు వివరించారు. చార్జీషీట్‌లో రేవ్ పార్టీ నిర్వాహకులుగా 9 మందిని పేర్కొన్నారు. మొత్తం 1086 పేజీల ఛార్జ్ షీట్ దాఖలైంది. అయితే పోలసులు తాజా ఛార్జ్ షీట్ తో ఈ కేసు వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. అయితే బెంగళూరు రేవ్ పార్టీలో తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని ఇటీవల హేమ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆమె కొన్ని రిపోర్ట్స్ ను కూడా మీడియా సమక్షంలో చూపించింది. కానీ, తాజాగా బెంగళూరు పోలీసులు మాత్రం ఛార్జ్ షీట్ లో ఆమె పేరును చేర్చడంతో హేమకు షాక్ తగిలి నట్టైంది.
మరోవైపు ఛార్జ్ షీట్ లో తన పేరు రావడంపై హేమ రియాక్ట్ అయింది. "చార్జీషీట్‌లో నా పేరున్నట్టు తెలిసింది. నేను డ్రగ్స్ తీసుకోలేదు. నేను అసలు శాంపిల్స్ ఇవ్వలేదు. నేను డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధం" అని ఛాలెంజ్ చేసింది. కానీ ఓ వైపు హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు పేర్కొనడం.. మరోవైపు హేమ మాత్రం డ్రగ్స్ తీసుకోలేదంటూ చాలెంజ్ చేయడంతో.. ఈ వ్యవహారం ఎటువైపు వెళ్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.
ఇక ఈ కేసులో హేమ ఇప్పటికే బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అనంతరం బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇక డ్రగ్స్ కేసులో పట్టుబడటంతో మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) హేమను సస్పెండ్ చేయగా.. ఆగస్టులో ఆ సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.