Naresh - Pavitra Lokesh Wedding: మూడుముళ్ల సాక్షిగా ఒక్కటైన నరేష్, పవిత్రా లోకేష్
Naresh Pavitra Lokesh Wedding: మైసూర్‌లో అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో నరేష్, పవిత్ర వివాహం జరిగింది. సంప్రదాయ బద్ధంగా మూడు ముళ్లు, ఏడు అడుగులతో ఒక్కటయ్యారు.

సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్ మూడుముళ్ల సాక్షిగా ఒక్కటయ్యారు. ఇప్పటివరకు సహజీవనం సాగిస్తున్న ఈ జంట తాజాగా పెళ్లి చేసుకుని తమ బంధాన్ని మరింత దృఢం చేసుకుంది. తమ పెళ్లికి సంబంధించిన వీడియోను శుక్రవారం వారు మీడియాకు విడుదల చేశారు.
మైసూర్‌లో అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో నరేష్, పవిత్ర వివాహం జరిగింది. సంప్రదాయ బద్ధంగా మూడు ముళ్లు, ఏడు అడుగులతో ఒక్కటయ్యారు. పెళ్లి వీడియోని చిత్రీకరించిన ఈ జంట దానిని మీడియాకు విడుదల చేసింది. త్వరలో శుభవార్త చెబుతామని వారు జంటగా న్యూ ఇయర్ సందర్భంగా ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ శుభవార్త ఈ వివాహమే.
గత కొంతకాలంగా వీరిద్దరి వ్యవహారం అనేక రకాల రూమర్లు, గొడవలతో వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. నరేష్ రెండో భార్య రమ్య రఘుపతితో వివాదం కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో అయితే ట్రోలింగ్‌లకు అంతూ పొంతూ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ పెళ్లితో వీరిద్దరూ తమపై కొనసాగుతున్న వివాదానికి తెర దించే ప్రయత్నం చేశారు. ఇక వీరి వివాహంతో వీరిపై రూమర్లకు తెరపడే అవకాశముంటుందో వేచిచూడాలి.
పెళ్లిపై ఇప్పటివరకు ఎవరూ కామెంట్ చేయకపోవడం గమనార్హం. రమ్య రఘుపతితో నరేష్‌కి విడాకుల కేసు కోర్టులో ఉన్న విషయం తెలిసిందే. విడాకుల కేసు తేలిందా లేదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో ఈ వివాహం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచిచూడాలి.