Telugu Global
NEWS

చిరంజీవి, నేను భార్యాభ‌ర్త‌ల్లా పోట్లాడుకుని క‌లిసిపోతుంటాం.. - న‌టుడు మోహ‌న్‌బాబు

కొన్ని సంద‌ర్భాల్లో తాను ఎమోష‌న్ల‌ను కంట్రోల్ చేసుకోలేన‌ని మోహ‌న్‌బాబు అన్నారు. ఎన్టీఆర్‌, కృష్ణ మృతిచెందిన‌ప్పుడే కాదు.. ఇటీవ‌ల త‌న కుమారుడు మ‌నోజ్ పెళ్లి చేసుకున్న‌ప్పుడు కూడా తాను క‌న్నీళ్లు ఆపుకోలేక‌పోయాన‌ని ఆయ‌న వివ‌రించారు.

చిరంజీవి, నేను భార్యాభ‌ర్త‌ల్లా పోట్లాడుకుని క‌లిసిపోతుంటాం.. - న‌టుడు మోహ‌న్‌బాబు
X

చిరంజీవి, తాను భార్యాభ‌ర్త‌ల్లా పోట్లాడుకుని క‌లిసిపోతుంటామ‌ని సీనియ‌ర్ సినీ న‌టుడు మంచు మోహ‌న్‌బాబు అన్నారు. ఆదివారం మార్చి 19వ తేదీ ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. మోహ‌న్‌బాబు ఈ విష‌యం వెల్ల‌డించారు. త‌న జీవితంలో ఎన్నో భ‌యంక‌ర‌మైన ఎత్తు ప‌ల్లాలు చూశాన‌ని ఈ సంద‌ర్భంగా మోహ‌న్‌బాబు తెలిపారు. త‌న‌కు ప‌గ‌వాళ్లెవ‌రూ లేర‌ని, కానీ తాను ఎదుర్కొన్న క‌ష్టాలు మాత్రం ఎవ‌రికీ రాకూడ‌ద‌ని ఆయ‌న చెప్పారు.

ప‌దే ప‌దే త‌నకు, చిరంజీవికి మ‌ధ్య ఏదో వివాదాలు ఉన్న‌ట్టు మీడియాలో రాస్తుంటార‌ని చెప్పిన మోహ‌న్‌బాబు.. చిరంజీవి, తాను ఎన్నోసార్లు ఎదురుప‌డ్డామ‌ని, మాట్లాడుకున్నామ‌ని, అప్పుడ‌ప్పుడూ భార్యాభ‌ర్త‌ల్లా పోట్లాడుకున్నాం కూడా అని చెప్పారు. అయినా తాము మ‌ళ్లీ క‌లిసిపోతుంటామ‌ని ఆయ‌న తెలిపారు.

కొన్ని సంద‌ర్భాల్లో తాను ఎమోష‌న్ల‌ను కంట్రోల్ చేసుకోలేన‌ని మోహ‌న్‌బాబు అన్నారు. ఎన్టీఆర్‌, కృష్ణ మృతిచెందిన‌ప్పుడే కాదు.. ఇటీవ‌ల త‌న కుమారుడు మ‌నోజ్ పెళ్లి చేసుకున్న‌ప్పుడు కూడా తాను క‌న్నీళ్లు ఆపుకోలేక‌పోయాన‌ని ఆయ‌న వివ‌రించారు. త‌న కుటుంబంపై వ‌చ్చే ట్రోల్స్‌ని తాను ప‌ట్టించుకోన‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా తెలిపారు. మంచు విష్ణు న‌టించిన `జిన్నా` త‌న దృష్టిలో ఎక్స్‌ట్రార్డిన‌రీ మూవీ అని మోహ‌న్‌బాబు చెప్పారు. అది ఎందుకు ఫ్లాప‌యింద‌నే విష‌యం త‌న‌కు ఇప్ప‌టికీ ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మేన‌ని ఆయ‌న తెలిపారు.

First Published:  19 March 2023 2:30 PM IST
Next Story