Redmi 13C 4G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మీ (Redmi) తన రెడ్‌మీ 13సీ 4జీ ఫోన్ (Redmi 13C 4G) త్వరలోనే మార్కెట్లో ఆవిష్కరించనున్నది. గతేడాది డిసెంబర్‌లో మార్కెట్‌లో ఆవిష్కరించిన రెడ్‌మీ 12సీ 4జీ ఫోన్‌కు కొనసాగింపుగా రెడ్‌మీ 13సీ 4సీ (Redmi 13C 4G) వస్తోంది. రెడ్‌మీ13సీ 4జీ ఆవిష్కరణ విషయమై షియోమీ ఎటువంటి ప్రకటన చేయకున్నా.. అమెజాన్ యూఎస్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైంది. దాని ధర, స్పెషిఫికేషన్లు బయటకు వచ్చాయి.
రెడ్‌మీ 12సీ 4జీ (Redmi 13C 4G) బ్లాక్, లైట్ బ్లూ, లైట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో వస్తుందని సమాచారం. 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర సుమారు రూ.11,700 ($140.54) పలుకుతుందని అంచనా. రెడ్‌మీ 13సీ 4జీ ఫోన్ (Redmi 13C 4G) ఫోన్ 6.74-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. మీడియాటెక్ హేలియో జీ99 ఎస్వోసీ (MediaTek Helio G99 SoC) చిప్‌సెట్‌తో వస్తున్న రెడ్‌మీ 13సీ 4జీ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఎంఐయూఐ14 వర్షన్‌పై (MIUI 14 based on Android 13) పని చేస్తుంది.
4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా వస్తున్న రెడ్‌మీ 13సీ 4జీ ఫోన్ మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు. గతంలో వచ్చిన ఫోన్ల మాదిరే రెడ్‌మీ13సీ ఫోన్ కూడా మల్టీపుల్ ర్యామ్ విత్ స్టోరేజీ ఆప్షన్లలో వస్తుందని తెలుస్తోంది. అమెజాన్ యూఎస్ లిస్టింగ్ ప్రకారం 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 2-మెగా పిక్సెల్ డెప్త్ కెమెరాలతో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది.
రెడ్‌మీ 13సీ 4జీ (Redmi 13C 4G) ఫోన్ 16 వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5,000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. చార్జింగ్ అడాప్టర్ ఉంటుంది. 3.5 ఎంఎం ఆడియో జాక్‌తో వస్తున్న రెడ్‌మీ 13 4జీ (Redmi 13C 4G) ఫోన్ సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ కలిగి ఉంటుంది.
అమెరికా మార్కెట్‌లో రెడ్‌మీ13సీ 14 పేరుతో వస్తున్న ఈ ఫోన్.. భారత్ మార్కెట్‌లో రెడ్‌మీ నోట్ 13, రెడ్‌మీ నోట్13 ప్రో పేర్లతో వచ్చే జనవరిలో ఆవిష్కరిస్తారని సమాచారం. ఈ ఫోన్ వై-ఫై 5హెర్ట్జ్, బ్లూటూత్ కనెక్టివిటీ కలిగి ఉంటది.