Telugu Global
Family

అమ్మాయిలు, అబ్బాయిల్లో ఎవరు తెలివైన వాళ్లు? ఇంట్రెస్టింగ్ స్టడీ!

అమ్మాయిలు, అబ్బాయిల్లో ఎవరు తెలివైన వాళ్లు? అన్న దానిపై సైంటిస్టుల చేసిన స్టడీలో రెండు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడయ్యాయి.

అమ్మాయిలు, అబ్బాయిల్లో ఎవరు తెలివైన వాళ్లు? ఇంట్రెస్టింగ్ స్టడీ!
X

మెదడు పనితీరుపై రకరకాల కొత్త పరిశోధనలు చేస్తుంటారు సైంటిస్టులు. అయితే తాజాగా జర్మనీలోని టూబింజెన్ యూనివర్సిటీ సైంటిస్టులు అమ్మాయిలు తెలివైనవారా? అబ్బాయిలు తెలివైనవారా?అనే టాపిక్‌పై ఓ స్టడీ జరిపారు. అందులో ఏం తేలిందో ఇప్పుడు తెలుసుకుందాం.

అమ్మాయిలు, అబ్బాయిల్లో ఎవరు తెలివైన వాళ్లు? అన్న దానిపై సైంటిస్టుల చేసిన స్టడీలో రెండు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడయ్యాయి. అమ్మాయిలు, అబ్బాయిల్లో బ్రెయిన్‌ యాక్టివిటీ వయసు ఆధారంగా మారుతుందట. తెలివి పరంగా ఎవరి మెదడు ఎలా ఉంటుందంటే..

టూబింజెన్ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో సైంటిస్టులు మాగ్నెటోఎన్సిఫలోగ్రఫీ అనే ఇమేజింగ్ టెక్నిక్‌ని ఉపయోగించి మెదడులోని ఎలక్ట్రిక్ వేవ్స్, మ్యాగ్నెటిక్‌ ఫీల్డ్స్‌ను స్టడీ చేశారు. 13 నుంచి 59 రోజుల మధ్య వయస్సున్న 20 మంది శిశువులపై ఈ స్టడీ చేశారు. కొన్ని సౌండ్స్ ను పంపి దానికి మెదడు రియాక్ట్ అయ్యే తీరుని గమనించారు. ఈ స్టడీలో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అబ్బాయిల్లోని సిగ్నల్స్ కాంప్లెక్సిటీ అమ్మాయిల కంటే చాలా వేగంగా డెవలప్ అవుతుందట. బ్రెయిన్‌ కాంప్లెక్సిటీ ఎక్కువగా ఉన్నవారికి క్విక్ లెర్నింగ్, డెసిషన్‌ మేకింగ్‌ వంటి స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అయితే ఇదే అబ్బాయిల్లో వయస్సు పెరిగే కొద్దీ సిగ్నల్స్ కాంప్లెక్సిటీ వేగంగా తగ్గిపోతుందట.

దీన్నిబట్టి చూస్తే బాల్యంలో ఉన్నప్పుడు మగపిల్లలు చురుగ్గా, తెలివిగా ఉండే అవకాశం ఉందని, వయసు పెరిగే కొద్దీ అది తగ్గిపోయే అవకాశం ఉన్నట్టు తేల్చారు. అయితే అమ్మాయిల్లో దీనికి రివర్స్‌లో జరుగుతుందట. చిన్న వయసులో కాస్త తక్కువ చురుగ్గా ఉన్నా వయసు పెరిగే కొద్దీ తెలివితేటలు పెరుగుతాయట. అయితే ఇది చాలా తక్కువమంది బ్రెయిన్ సిగ్నల్స్ శాంపిల్స్ డేటా ఆధారంగా రూపొందించిన రిపోర్ట్ మాత్రమే. అందరికీ ఇది ఇలానే వర్తిస్తుందని చెప్పలేము.

First Published:  4 May 2024 11:44 AM IST
Next Story