ముందుగా న్యూ ఇయర్ వచ్చేది ఇక్కడే..
ప్రపంచంలోని అన్ని దేశాలు ఒకేసారి న్యూ ఇయర్‌లోకి అడుగుపెట్టవు. భూమి తిరిగే దిశను బట్టి కొన్ని దేశాలు ముందుగా, మరికొన్ని దేశాలు కొన్ని గంటల తర్వాత న్యూఇయర్‌లోకి ప్రవేశిస్తాయి.
కొన్ని గంటల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్‌ను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ప్రపంచంలోని అన్ని దేశాలు ఒకేసారి న్యూ ఇయర్‌లోకి అడుగుపెట్టవు. భూమి తిరిగే దిశను బట్టి కొన్ని దేశాలు ముందుగా, మరికొన్ని దేశాలు కొన్ని గంటల తర్వాత న్యూఇయర్‌లోకి ప్రవేశిస్తాయి.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు దగ్గర్లో పసిఫిక్ మహాసముద్రంలో ఉండే కొన్ని ద్వీపాలను కలిపి ఓసియేనియా అంటారు. ఈ దేశాలు ఇతర దేశాల కంటే ముందుగా 2023కు స్వాగతం పలుకుతాయి. ముఖ్యంగా ఓసియేనియాలోని టోంగా, కిరిబతి, సమోవా వంటి పసిఫిక్ ఐలాండ్ దేశాలు ప్రపంచంలోని ఇతర దేశాలకంటే ముందుగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొదలుపెడతాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో దేశాల్లో నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. మన టైం ప్రకారం చెప్పాలంటే డిసెంబర్ 31 మధ్యాహ్నం 3:30 గంటలకే ఓసియేనియాలో న్యూ ఇయర్ వేడుకలు మొదలవుతాయి.
ఇకపోతే అమెరికాకు చెందిన బేకర్, హౌలాండ్ ఐలాండ్‌లు న్యూఇయర్‌కు చివరగా స్వాగతం పలుకుతాయి. మన టైం ప్రకారం చెప్పాలంటే జనవరి 1 సాయంత్రం 5:30 గంటలకు ఈ ప్రాంతం కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతుంది. ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలకు చాలా చరిత్ర ఉంది. సుమారు 4 వేల ఏండ్ల క్రితం నుంచి ఈ వేడుకలు జరుపుతున్నారు.