Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Thursday, September 11
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Editor's Choice

    పదేళ్లు కాదు, ఏడాది పాలనపైనే తిరుగుబాటు

    By Raju AsariJanuary 27, 20253 Mins Read
    పదేళ్లు కాదు
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    వినేవాళ్లు ఉంటే సీఎం ఎనుముల రేవంత్‌ రెడ్డి ఎన్ని ముచ్చట్లైనా చెబుతారు. ఆదివారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో భారత రత్న బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. పదేళ్లు తానే సీఎంగా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. దీనికి ఆయన ఒక ఉదాహరణ చెప్పుకొచ్చారు. 1994-2004 వరకు టీడీపీకి, 2004-2014 వరకు కాంగ్రెస్‌కు, 2014-2024 వరకు బీఆర్‌ఎస్‌కు ప్రజలు అవకాశం ఇచ్చారు. 2024-2034 వరకు కాంగ్రెస్‌కు కూడా ప్రజలు అవకాశమిస్తారని నాకు నమ్మకం ఉందన్నారు.

    ముఖ్యమంత్రి తన నాయకత్వం మీద తనకు నమ్మకంతో పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారం, తానే సీఎం అని సమయం వచ్చినప్పుడల్లా ప్రస్తావిస్తున్నారు. అయితే ప్రజలు ఆ పార్టీలకు రెండోసారి అధికారం ఎందుకు ఇచ్చారు? దాని వెనుక ఉన్న అంశాలు ఏమిటి అన్నది రేవంత్‌ రెడ్డి చెప్పలేకపోతున్నారు. 1994లో ఎన్టీఆర్‌ నాయకత్వానికి ప్రజలు జై కొట్టారు. ఆ తర్వాత టీడీపీలో నెలకొన్న సంక్షోభంతో చంద్రబాబు సీఎం అయిన సంగతి అందరికీ తెలిసిందే. 1999లో కేంద్రంలో వాజపేయ్‌ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్గిల్‌ యుద్ధం విజయం తర్వాత ఎన్నికలకు వెళ్లింది. అప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి అది కలిసి వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయకత్వానికే ప్రజలు మద్దతు పలికారు అనుకోవడానికి ఏమీ లేదు.

    1994-2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో అనేక సమస్యలకు తోడు, ముఖ్యంగా తెలంగాణలో ఎన్‌కౌంటర్లు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర వంటివే కాకుండా సీపీఐ, సీపీఎం కూడా టీడీపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో జట్టుకట్టింది. ఇవన్నీ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడ్డాయి. అంతేకాదు తెలంగాణలో టీడీపీ కంచుకోటలను బీఆర్‌ఎస్‌ బద్దలు కొట్టింది. పొత్తులో భాగంగా నాటి కాంగ్రెస్‌ పార్టీ బీఆర్ఎస్‌కు ఇచ్చిన సీట్లను చూస్తే ఆ స్థానాలను ఆపార్టీ వదిలేసుకున్నట్టే అనుకోవచ్చు. వైఎస్‌ నేతృత్వంలో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు కేంద్రంలో ఉపాధి హామీ పథకం, రుణమాఫీ వంటివి 2009లో రెండోసారి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమయ్యాయి.

    2009లో కేసీఆర్‌ నిరాహారదీక్ష దేశ రాజకీయాలను మార్చింది. అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు బీఆర్‌ఎస్‌ అలుపెరుగని పోరాటం చేసింది. అందుకే 2014లో బీఆర్‌ఎస్‌ ఒంటరిగా పోటీ చేసినా ఉద్యమనాయకుడు కేసీఆర్‌కే తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. కొత్త ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని విఫల రాష్ట్రంగా చేయడానికి సూత్రధారి ఆదేశాలతో పాత్రధారి ప్రయత్నించి విఫలమయ్యాడు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఐదేళ్ల కాలంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కేసీఆర్‌ కృషి చేశారు. సాగునీటి సౌకర్యం, విద్యుత్‌, సంక్షేమ పథకాలు, వ్యవసాయ అనుకూల విధానాలతో తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు బాగా మెరుగయ్యాయి. దీంతో 2018లో కేసీఆర్‌ ఆరు నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లినా భారీ మెజారిటీతో ప్రజలు మరోసారి గెలిపించారు. 2018-2024 కాలంలో బీఆర్‌ఎస్‌ సంక్షేమ పథకాలు అమలు చేసినా, యాదాద్రి ఆలయాన్ని పునర్‌ నిర్మించినా, కొత్త సెక్రటేరియట్‌ కట్టినా, కాళేశ్వరం ద్వారా సాగు నీళ్లు అందించినా ప్రజలు మార్పు కోరుకున్నారు. దీనికి కాంగ్రెస్‌ చేసిన అసత్య ప్రచారాలతో పాటు అలవిగాని హామీలు కారణం.

    రేవంత్‌ నేతృత్వంలో ఏర్పడి కాంగ్రెస్‌ ప్రభుత్వం వందరోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న హామీని ఏడాది గడిచినా ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం మినహా ఏదీ సంపూర్ణంగా పూర్తి చేయలేదు. పథకాలపై సీఎం ప్రకటనలన్నీ శుష్క వాగ్దానాలు, శూన్య హస్తాలని తేలిపోయింది. ఏడాది కిందట ఏ వర్గాలైతే బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారో ఆ వర్గాలే రేవంత్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ పాలనపై రాని వ్యతిరేకతను ఏడాదిలోనే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మూటగట్టుకున్నది. రేవంత్‌రెడ్డి ఏడాది కాలంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై ప్రజలను మభ్యపెడుతూ, మాట మారుస్తూ.. నాలుక మడతేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. మార్పు కోరుకున్న ప్రజలే ఇంకా నాలుగేళ్లు ఎట్లా గడవాల్నో అని ఆవేదన చెందున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నదో గ్రామసభల్లోనే తేలిపోయింది. 1994-2014 వరకు ఉన్న రాజకీయ పరిస్థితులు తెల్వక మళ్లా ఐదేళ్లు మాదే అని రేవంత్‌రెడ్డి భ్రయపడుతున్నాడు. కానీ ఆయన అనుకుంటున్న పదేళ్లు కాదు, ఏడాది పాలనపైనే ప్రజలు తిరగబడుతున్నారన్నది నిప్పు లాంటి నిజం.

    CM A Revanth Reddy Failure
    Previous Articleమహా కుంభమేళాలో యోగి, రాందేవ్‌ బాబా యోగాసనాలు
    Next Article అంబేద్కర్‌ను అవమానించిన అమిత్‌ షాపై చర్యలు తీసుకోవాలి
    Raju Asari

    Keep Reading

    పేరు రైతులది.. పైసలు కాంట్రాక్టర్లకు!

    రేవంత్‌ విన్నపాలపై రాహుల్‌ రాడార్‌!

    వివాదాలు, విభేదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా కాంగ్రెస్‌

    ఎక్కే విమానం.. దిగే విమానం!

    రేవంత్ సర్కారు తొందరపాటు.. ప్రమాదంలో ఎస్ ఎల్ బీసీ భవితవ్యం

    రాష్ట్ర ఆదాయంపై రేవంత్‌ వేటు!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.