పోదాం పద..పెద్దగట్టు జాతరకు
సబ్బండ వర్ణాల ప్రజలు "ఓలింగా..! ఓ లింగా !!" అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు

కల్మశం లేని కష్టజీవులు కలిసి జరుపుకునే పెద్దగట్టు జాతర తెలంగాణలోనే రెండో అతిపెద్ద సామూహిక వేడుక. ఇక్కడ భగ వంతుడికి, భక్తుడికి మధ్య వారధులెవరూ ఉండరు. వీరిని ఏకం చేసే ఒకే ఒక దివ్యమంత్రం... 'ఓ లింగా'.!!
జాతర.. సంస్కృతి, ఆచార వ్యవహారాలకు అద్దం పట్టే ఉత్సవం. ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని, జీవన సౌందర్యాన్ని ప్రతిబింబింపజేసే సంరంభం. ప్రజలు తమకు రక్షణ కల్పించిన వారినో, యుద్ధ వీరులనో దేవుళ్లుగా తలచి పూజించే సంబురం. వందల ఏండ్ల చరిత్ర కలిగిన పెద్దగట్టు జాతరకు చాలానే పేర్లున్నాయి. దురాజ్ పల్లి జాతర, గొల్ల గట్టు జాతర.. లింగమంతుల జాతర.. పేరు ఏదైనా, దైవం మాత్రం లింగమంతుడే...
రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు లక్షలాది పైనే జనం వస్తుంటారు. మన రాష్ట్రం నుంచే గాక మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్, ఒరిస్సా, కర్నాటకల నుంచి కూడా భక్తులు పోటెత్తుతారు. సబ్బండ వర్ణాల ప్రజలు "ఓలింగా..! ఓ లింగా !!" అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నిన దిస్తూ ఆ దేవుడిని వేడుకుంటారు. ఇక్కడి లింగమంతుల జాతరలో వేద బ్రాహ్మణులు కాకుండా యాదవులు పూజారులు కావడం విశేషం. 'ఓ లింగా ఓ లింగా' అనే భక్తుల పిలుపే ఏకైక మంత్రం.
ఇలా వెళ్లాలి...
నల్లగొండ జిల్లాలోని పెద్దగట్టు... హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై దురాజ్ పల్లి గ్రామ పరిధిలో ఉంది. హైదరాబాద్‌కు 150 కిలో మీటర్లు, సూర్యాపేటకు 6 కి.మీ. దూరంలో ఉంటుంది. విజయవాడ నుంచి వచ్చే భక్తులు కోదాడ మీదుగా చేరుకోవాలి. గుంటూరు వైపు నుంచి వచ్చే వారు మిర్యాలగూడ, నేరేడుచర్ల, గరిడేపల్లి మీదుగా నేరుగా పెద్దగట్టు చేరుకోవచ్చు. వరంగల్, హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు సూర్యాపేట చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక బస్సుల్లో జాతరకు రావచ్చు. అన్ని ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకునేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తుంది.
లింగమంతుడికి నైవేద్యం..
పెద్దగట్టు జాతరలో లింగమంతుడు. సహా చౌడేశ్వరి (సౌడమ్మ, చాముండే శ్వరి), గంగాభవాని, యలమంచమ్మ, అకుమంచమ్మ, మాణిక్యాలదేవి పూజ లందుకుంటారు. వీరిలో లింగమం తుడు శాఖాహారి కావడంతో ఆయనకు నైవేద్యం సమర్పిస్తారు. తక్కిన దేవత లకు జంతుబలి ఇచ్చి సంతృప్తి పరుస్తారు.
అన్నా, చెల్లెళ్లకు ప్రత్యేకం
పెద్దగట్టు పరిధిలో ఎటు చూసినా కిలోమీటర్లు ఊసినా కిలోమీటర్ల వరకు జాతర రద్దీ కనిపిస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులు టెంట్లు ఏర్పాటు చేసుకుని విడిది చేస్తారు. ఇక గట్టు సమీపంలో కోలాహలం అంతా ఇంతా కాదు. అన్నలు తమ చెల్లెళ్లకు జాతరలో గాజులు కొనివ్వడం ఏళ్ల తరబడి వస్తున్న సంప్రదాయం.
జాతర ప్రారంభం ఇలా....
'గొల్లగట్టు జాతర'గా మరోపేరుతోనూ పిలుచుకునే ఈ జాతర ఐదు రోజులపాటు ఘనంగా జరుగుతుంది. పుష్యమాస అమావాస్య ఆదివారం రోజు దిష్టిపూజతో జాతర ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. ఆ రోజున తల్లి, పిల్ల గొర్రెను గట్టుపై బలిస్తారు. దీనినే బలిపూజ అనికూడా పిలుస్తారు. వరంగల్ జిల్లా చీకటాయపాలెం నుంచి యాదవ పూజారులు చౌడమ్మ పల్లకి తీసుకురాగా, సూర్యాపేట నుంచి మకరతోరణం ఇతర ఆభరణాలు గుట్టకు తీసుకువచ్చి అలంకరిస్తారు. పౌర్ణమికి అటు ఇటు వచ్చే ఆదివారం (ఫిబ్రవరి 16న) జాతర ప్రారంభమైంది.
జాతర తొలి రోజు: ఆదివారం రోజున జాతర హడావిడి మొదలవుతుంది. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే భక్తులు రాత్రి తమ ఇళ్లలో గంపలు వెళ్లదీసే కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. సంప్రదాయ ఆయుధాలు తీసుకుని ఎవరికి వారు తమ వాహనాల్లో రాత్రి. లోపే ఇక్కడకు చేరుకుంటారు.
రెండో రోజు: సోమవారం జాతరలో ప్రత్యేకమైంది. యాదవ పూజారులు పోలు ముంతలు, బొట్లు, కంకణాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహిళలు తెల్లవారుజామునే బోనం వండుకుని లింగమంతుల స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. ఇదే రోజున జంతుబలి కొనసాగు తుంది. ఈ రోజున భక్తజన రద్దీ ఎక్కువగా ఉంటుంది.
మూడో రోజు: మంగళవారం 'చంద్రపట్నం' వేస్తారు. బియ్యం పిండి, పసుపు కలిపిన పదా ర్థంతో ఆలయాల ఎదుట ముగ్గు వేస్తారు. నాలుగువైపులా గురుగులు ఏర్పాటు చేసి దీపాలు వెలిగిస్తారు.
నాలుగో రోజు: బుధవారం నెలవారం. దేవరపెట్టెను తొలిగిస్తారు. ఈ దేవరపెట్టె దిష్టిపూజ రోజున ఇక్కడికి చేరుకుంటుంది. తొలగించిన అనంతరం సమీపంలోని కేసారం గ్రామానికి తర లిస్తారు. తిరిగి మరో ఏడాది జరిగే జాతర సమయంలోనే ఈ పెట్టెను తీసుకొస్తారు.
ఐదో రోజు: మకర తోరణం తొలగింపు. మూలవిరాట్ల అలంకరణకు ఉపయోగించే ఈ ఆభరణం మొసలి శరీరం, సింహం తలభాగం కలిసిన ఆకృతితో చెక్కి ఉండడం గమనార్హం.గజ్జెలు, భేరీలు, తాళాలు, పిల్లనగ్రోవి శబ్దాలు.. బండ్లు లాగుతున్న ఎద్దుల మెడలో గణగణ మోగే గంటలు.. 'ఓలింగా ఓ లింగా' అంటూ భక్తులు తన్మయం.. మరోవైపు జెయింట్ వీల్స్, జంతు ప్రదర్శన శాలలు, రంగు లరాట్నాల వద్ద యువతీ, యువకుల కేరింతలు, తప్పిపోయిన వారి కోసం ఏర్పాటు చేసిన శిబిరాల నుంచి పోలీసులు అనౌన్స్ మెంట్లు.. పెద్ద మర్రిచెట్టు దగ్గర ఏర్పాటు చేసిన సామాజిక చైతన్య కార్యక్రమాలు, ప్రత్యే కంగా తయారు చేసిన మిఠాయిల విక్రయాలు, చిన్నపిల్లల బొమ్మల కొనుగోళ్లు, చెరుకు రసాలు.. ఒకటేమిటి ప్రతి ఏటా జాతర వస్తే బాగుం డనే ఆలోచనలు మది నిండిపోతాయి. దూరం నుంచి గుట్టను గమనిస్తే మూడువైపులా ఉన్న మెట్ల మార్గంలో భక్తుల రాకపోకలు గట్టుకు పూల మాలలు అల్లినట్టుగా తోస్తుంది.
యాదవుల ప్రత్యేక వేషధారణ
యాదవులు తమకు, తమ సంపదలైన గోవులకు రక్షణగా నిలిచిన లింగమంతుడిని ఇక్కడ ఆరాధిస్తారు. జాతరకు వచ్చే భక్తుల్లో అత్యధికులు యాదవులు, వారు ప్రత్యేక వేషధారణ, వాయిద్యాలతో జాతరకు ఒకరోజు ముందే బంధుమిత్రులతో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లపై ఇక్కడికి చేరు. కుంటారు. మగవాళ్లు ఎరుపు రంగు బనియన్, గజ్జెల నిక్కరు ధరించి,కాళ్లకు గజ్జెలు కట్టుకుని, అవుసరాలు (ప్రత్యేకమైన తల్వార్లు) చేతుల్లో పట్టుకుని భేరీలు, తాళాల ఢిళ్లిం... భళ్లం... శబ్దాల నడుమ లయబద్దంగా నడుస్తూ 'ఓలింగా... ఓ లింగా!!' అంటూ హోరెత్తిస్తారు.
మహిళలు తడి బట్టలతో పసుపు, కుంకుమ, పూలదండలు, అగరొ త్తులతో అలంకరించిన మంద గంపను నెత్తిన పెట్టుకుని నడుస్తారు. ఇంట్లోని అడపిల్లలు, సంతానం లేని మహిళలు బోనం కుండ ఎత్తుకుం టారు. తోడుగా వచ్చిన వాళ్లు దేవుడికి బలిచ్చే గొర్రెపోతును తీసుకొస్తుం టారు. ఇక్కడికి రావడానికి ముందుగానే గొర్రెపోతుకు స్నానం చేయి స్తారు. పూలమాల మెడలో వేసి దేవుడు ఉన్న దిక్కువైపు వదిలేస్తారు. దాంతో గొర్రెపోతు తన ఒంటిపై ఉన్న నీళ్లను దులిపేసుకోవడానికి శరీ రాన్ని దులిపేస్తుంది. అలా చేయడాన్ని 'జడత పట్టించడం' అంటారు. అలా చేయనిపక్షంలో దాని బదులు మరో గొర్రెపోతును తీసుకొస్తారు. జడత ఇచ్చే వరకు నీళ్లు చల్లుతారు. జడత ఇస్తేనే దేవుడు మెచ్చాడని యాదవుల నమ్మకం. లేదంటే 'నీకు ఏం తక్కువ చేశాం దేవుడా" అంటూ నిట్టూరుస్తారు.
పెద్దగట్టుకు 200 ఏళ్ల చరిత్ర
పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు సుమారు 200 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఇందుకు పలు, ప్రాంతాల్లో ఆయా సందర్భాల్లో లభించిన శాసనాలే వారికి ఆధారం. కానీ, క్రీ.శ.11వ శతాబ్దంలో రాష్ట్రకూట వంశానికి చెందిన ధ్రువుడు అనే రాజు తన పేరిట ఇక్కడ గ్రామాన్ని నిర్మించాడని, ఆయన పేరిటే ఈ గ్రామం దురాజ్ పల్లిగా పేరొందినట్లు కొందరి వాదన. కానీ, చరిత్రకారులు మాత్రం ప్రస్తుతం పూజలందుకుంటున్న విగ్రహాలకు 200 సంవత్సరాల వయసు ఉంటుందని చెబుతున్నారు. కానీ, గతంలో జాతర జరిగిన గట్టును, అక్కడి విగ్రహాలను ఇంత వరకు ఎవరూ పరిశీలించలేదు. నేటికీప్రయత్నాలు జరగలేదు. ఆ పరిసరాలను గమనిస్తే ఎన్నో ఏళ్ల చరిత్ర ఉండవచ్చని సమాచారం. జాతర విశేషాలను గురించి ఇక్కడ యాదవ్ పూజారులుగా పనిచేసిన పలువురు మాట్లాడుతూ.. తమ ముత్తాతల కాలం నుంచి మా వంశీకులు జాతరలో పూజారులుగా వ్యవ ''హరిస్తున్నారని' చెప్పారు. దీనిని బట్టి జాతరకు దాదాపు వందల ఏళ్ల చరిత్ర ఉంటుందని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో లింగమంతుల చరిత్ర, జాతర తదితర అంశాలపై 2009 సంవత్సరంలో 'లింగమంతుల అధ్యయన పీఠం' ఏర్పాటైంది. లింగమంతుల స్వామి కాలం, సమయం, జాతర నేపథ్యం, ఆధారాలు, విశేషాలు తదితర అంశాలపై పీఠం అధ్య యనం చేస్తోంది.
ఉండ్రుగొండ నుంచి దురాజ్ పల్లికి...
దురాజ్ పల్లికి సమీపంలో ఉండ్రుగొండ అనే గ్రామం ఉంది. దీని శివారులో పెద్ద అటవీప్రాంతం, ఏడు నుంచి ఎనిమిది కొండ గుట్టలు ఉన్నాయి. ఇక్కడ శైవ, వైష్ణవ మతాలు వర్ధిల్లినట్లు తెలిపే ఆనవాళ్లు, రాతి కట్టడాల మధ్యన కోనేరు నిర్మితమై ఉంది. ప్రస్తుతం దురాజ్పల్లి సమీ పంలో జరిగే లింగమంతుల జాతర గతంలో ఉండ్రుగొండకు సమీపం లోని పెద్దగుట్టపై జరిగేది. అక్కడి నుంచి పెద్దగట్టుకు మారేందుకు కారణమేదైనా... ఓ కథ మాత్రం ప్రచారంలో ఉన్నది. జాతర సమ యంలో మందగంప ఎత్తుకుని వెళ్తున్న ఓ గర్భిణి ఉండ్రుగొండ -గుట్ట ఎత్తుగా ఉండడంతో అదుపు తప్పి పడిపోయి మృతి చెందిందని, "ఆ కారణంతో దేవుడు ఓ వ్యక్తి కలలో కనిపించి తనను పెద్దగట్టుకు మార్చమని చెప్పాడని చెబుతుంటారు. దాంతో 200 ఏళ్లుగా పెద్దగ ట్టులో జాతర నిర్వహిస్తున్నారు.
బండకడుగుడు వర్షం....
జాతరలో పెద్ద ఎత్తున జంతుబలి ఇవ్వడంతో గట్టు రక్తంతో ఎరుపెక్కుతుంది. ఎక్కడిక క్కడ రక్తం పేరుకుపోతుంది. ఈ నేపథ్యంలో జాతర పూర్తయిన మూడు లేదా నాలుగో రోజున పెద్దగట్టు ప్రాంతంలో వర్షం కురుస్తుంది. దీనిని ఇక్కడి వాళ్లు 'బండకడుగుడు వర్షం'గా వీలుస్తారు. గుట్టను శుద్ధి చేసేందుకు వర్షం పడుతుందని వీరు చెబుతారు. ఏదేమైనప్పటికీ జాతర చరిత్రలో ఇది నిజమే అనిపించేలా ప్రతి సారీ వర్షం పడడం విశేషం.
ఆలయ నిర్మాతలు వీరే...
1981కి ముందు పెద్దగట్టు జాతరను వెలమదొరలు నిర్వహించగా, ఆ తర్వాత 1982 నుంచి యాదవ కులస్తుల ఆధీనంలో జరుగుతోంది. పెద్దగట్టుపై రెండేళ్ల కిందట కొత్త ఆలయాలు నిర్మించారు. గతంలో ఇక్కడ రెండు చిన్న గుడులు మాత్రమే కనిపించేవి. వీటిని కొన్నేళ్ల కిందట పెద్ద గట్టు సమీపంలోని కాసారం గ్రామానికి చెందిన గొర్ల లింగమరెడ్డి, మెంతెబోయిన భిక్షం యాదవ్ అనే ఇద్దరు లింగమంతుల స్వామి భక్తులు నిర్మించినట్టు సమాచారం.
- KLN