Editor’s Choice

ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలికిన నాయకుడిగా గోర్బచెవ్ ను పశ్చిమ దేశాలు అప్పుడూ స్తుతించాయి. మరణానంతరమూ పొగుడ్తూనే ఉన్నాయి. ఏ యుద్ధానికైన ముగింపు పలికితే సంతోషించవలసిందే.

జాతీయత పేరుతో దేశభక్తి కొంగజపం చేస్తున్న బిజెపి విధానాలు దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశాయి. చేయడానికి పనుల్లేక అర్ధాకలితో అలమటించే వారికి బిజెపి బూటకపు జాతీయతా నినాదాలు ఒరగబెట్టేదేమీ లేదు. కనుకనే ఆర్థిక, రాజకీయ రంగాలలో జనం కోసం కాంగ్రెస్‌ ఏం చేయబోతున్నదో నిర్దిష్టంగా, కచ్చితంగా చెప్పాలి. తద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి, నిజమైన జాతీయతావాదానికి బలం చేకూరుతుంది.

బంగ్లాదేశ్ తలసరి ఆదాయం కంటే భారత్ తలసరి ఆదాయం ఇప్పుడు పడిపోయింది. ప్రపంచ దేశాల తలసరి ఆదాయాల లెక్కతీస్తే.. భారత్ లోయర్ మిడిల్ ఇన్ కమ్ గ్రూప్‌లో ఉంది. అంటే సగటు భారతీయుడి సంపాదన విషయంలో భారత్ పరిస్థితి ఘోరంగా ఉంది.

స్వాతంత్య్రం వచ్చిన సమయంలో ఆమె కలలు ఏమిటి? అవి ఏ మేరకు నెరవేరాయో వివ‌రించి చెప్పగలిగిన సుదీర్ఘ అనుభవం రొమిల్లా థాపర్‌కు ఉంది. ఆ తరం దేశం ఎలా ఉండాలని భావించింది, అలాగే ఉందా లేదా అన్న విషయాలు ఆమె మాటల్లోనే..

సౌదా, ఓల్గా లాంటి వారి ర‌చ‌న‌లు చ‌ర్చ‌కీ, పున‌రాలోచ‌న‌కీ ప్రేర‌ణ‌గా నిలిచాయి. రాముడిని, కృష్ణుడిని ఆరాధించే వారూ ఆ ర‌చ‌న‌లు చ‌దివారు. మ‌న ద‌గ్గ‌ర‌ ఎక్క‌డా ద్వేషానికి చోటు లేదు.

యూరప్ కరువు కోరల్లో చిక్కుకుంది. వాతావరణ మార్పుల వల్ల అక్కడ నదులు ఎండిపోయాయి. వ్యవసాయం దెబ్బతింది, పశువులకు కూడా తాగు నీళ్ళు, ఆహారం లేక పాల ఉత్పత్తులు పడిపోయాయి. చివరకు ప్రజలకు తాగడానికి కూడా మంచినీళ్ళు దొరకడం లేదు. బ్రిటన్ ప్రభుత్వం మంచి నీళ్ళపై ఆంక్షలు విధించింది.

ఎన్డీయేలో ప్రధాన భాగస్వామి అయిన బీజేపీ.. తమ ప్రత్యర్థులపై ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలను ఎలా వాడుకుంటుందో కొన్నాళ్లుగా దేశంలోని ప్రజలందరూ చూస్తున్నారు. అదే సమయంలో తమ పార్టీకి చెందిన వారిపై ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నా.. వారిపై కనీస విచారణ కూడా చేయడం లేదు.

కుటుంబం నుంచి ఒక వ్యక్తి కాంగ్రెస్‌ను విడిచిపెట్టడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే. మునుగోడులో ఓడితే అది ఉమ్మడి నల్గొండ జిల్లాపైనే కాకుండా దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌ను బలహీనపరిచే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.

ఈటల రాజేందర్ టిఆర్ఎస్ నాయకునిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండడం వేరు. ఆయనకు ఆ సమయంలో లభించిన ప్రజాదరణ, కార్యకర్తలలో ఉండిన అభిమానం వేరు. అది తెలంగాణ ఉద్యమంతో, భావోద్వేగాలతో ముడిపడిన వ్యవహారం.

బీజేపీ అధికారంలోకి వచ్చాక వాళ్ళు కోరుకున్నది వాస్తవరూపంలోకి తెచ్చేందుకు పాఠ్యపుస్తకాలలో కూడా ఇష్టం వచ్చినట్టు మార్పులు చేర్పులు చేస్తున్నారు.