Telugu Global
CRIME

కారు ఎక్కమన్నడు.. రూ.2 కోట్లిస్తేనే వదులుతా అన్నడు

వైసీపీ నేతను కిడ్నాప్‌ చేసిన మరో వైసీపీ నాయకుడు

కారు ఎక్కమన్నడు.. రూ.2 కోట్లిస్తేనే వదులుతా అన్నడు
X

ఇద్దరూ ఒకే పార్టీ నాయకులు. మంచి పరిచయం కూడా ఉంది. రా కారు ఎక్కు అలా వెళ్లొద్దాం.. అనగానే నమ్మి కారు ఎక్కడం అతడి పాపమైంది. రూ.2 కోట్లు ఇస్తేనే వదిలేస్తే లేకుంటే లేదు అని తేల్చిచెప్పాడు అవతలి వ్యక్తి. తన దగ్గర అంత డబ్బు లేదని చెప్పడంతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గంటూరు జిల్లా నల్లపాడులో కలకలం సృష్టించింది. నల్లపాడుకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, వైసీపీ నేత నాగేశ్వర రావును అదే పార్టీకి చెందిన దుగ్గెం నాగిరెడ్డి అనే వ్యక్తి బుధవారం కిడ్నా చేశాడు. నాగేశ్వర్‌ రావును కారులో ఎక్కించుకున్న నాగిరెడ్డి పేరేచర్ల కైలాసగిరి వైపునకు తీసుకెళ్లి తనకు రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. తన దగ్గర అంత డబ్బు లేదని చెప్పినందుకు నాగేశ్వర్‌ రావుపై దాడికి పాల్పడ్డాడు. ఇద్దరి మధ్య పెనుగులాటలో కొండపై నుంచి నాగేశ్వర్‌ రావు కింద పడిపోయాడు. ఆయన కేకలు వేయడంతో సమీపంలో ఉన్నవాళ్లు రక్షించి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నాగిరెడ్డితో తనకు ఎలాంటి గొడవలు లేవని డబ్బు కోసమే తనను కిడ్నాప్‌ చేసి హత్యాయత్నం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

First Published:  11 Dec 2024 8:40 PM IST
Next Story