Telugu Global
CRIME

ప్రధాని మోడీని హత్య చేసేందుకు ప్లాన్‌ చేశాం

ముంబయి ట్రాఫిక్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు బెదిరింపు కాల్‌

ప్రధాని మోడీని హత్య చేసేందుకు ప్లాన్‌ చేశాం
X

ప్రముఖులపై బెదిరింపులకు పాల్పడుతూ ముంబయి ట్రాఫిక్‌ పోలీసులకు వరుస ఫోన్‌ కాల్స్‌ రావడం ఇటీవలకాలంలో కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గురువారం అలాంటి కాల్‌ మరొకటి వచ్చింది. ఈసారి ఏకంగా ప్రధాని నరేంద్రమోడీపై బెదిరింపులకు పాల్పడటంతో పోలీసులు అప్రమత్తయ్యారు.

ముంబయి ట్రాఫిక్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు గురువారం ఉదయం ఓ బెదిరింపు కాల్‌ వచ్చింది. అందులో ప్రధాని నరేంద్రమోడీ హత్య చేసేందుకు ప్లాన్‌ చేసినట్లు ఓ మహిళ బెదిరించారు. అందుకోసం ఓ ఆయుధాన్ని కూడా సిద్ధం చేసుకున్నట్లు చెప్పడంతో అధికారులు అలర్ట్‌ అయ్యారు. వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితురాలి నుంచి వచ్చిన ఫోన్‌ కాల్ ను ట్రేస్‌ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి బెదిరింపు ఫోన్ కాల్ చేసిన 34 ఏళ్ల మహిళను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు మహిళ మానసిక అనారోగ్యంతో బాధపడుతుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. కాగా.. ఇటీవల బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ బెదిరిస్తూ ముంబయి ట్రాఫిక్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు వరుసగా బెదిరింపు కాల్స్‌ వచ్చిన విషయం విదితమే.

First Published:  28 Nov 2024 12:45 PM IST
Next Story