వల్లభనేని వంశీకి హైకోర్టులో చుక్కెదురు
ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు
BY Raju Asari20 Feb 2025 12:54 PM IST

X
Raju Asari Updated On: 20 Feb 2025 12:54 PM IST
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కావాలని వంశీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్, దాడి కేసులో ఇటీవల వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఆయన విజయవాడలోని జిల్లా జైలో ఉన్నారు.
Next Story