రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వేద పాఠశాల విద్యార్థులు మృతి
ఈ ప్రమాదంలో డ్రైవర్ శివ, ముగ్గురు వేద పాఠశాల విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు.
BY Raju Asari22 Jan 2025 10:26 AM IST
X
Raju Asari Updated On: 22 Jan 2025 10:26 AM IST
కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ వాసులు ముగ్గురు మృతి చెందారు. మంగళవారం రాత్రి వేద పాఠశాల విద్యార్థులు మంత్రాలయం నుంచి హంపికి తుఫాన్ వాహనంలో బయలుదేరారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత సింధనూరుకు 5 కిలోమీటర్ల దూరంలో వాహనం టైర్ పంక్చర్ అయి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తుఫాన్ వాహనం నుజ్జునుజ్జయింది. డ్రైవర్ శివ, ముగ్గురు వేద పాఠశాల విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో వాహనంలో 14 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సింధనూరు హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story