Telugu Global
CRIME

'గేమ్‌ ఛేంజర్‌' సినిమాను లీక్‌ చేస్తామని బెదింపులు

బెదిరించిన వారిపై చిత్ర బృందం సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు..దర్యాప్తు ప్రారంభించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

గేమ్‌ ఛేంజర్‌ సినిమాను లీక్‌ చేస్తామని బెదింపులు
X

తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే 'గేమ్‌ ఛేంజర్‌' సినిమాను లీక్‌ చేస్తామంటూ బెదిరించిన వారిపై చిత్ర బృందం సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సినిమా విడుదలకు ముందు నిర్మాతలతో పాటు టీమ్‌లోకి కొందరు కీలక వ్యక్తులకు వాట్సప్‌, సోషల్‌ మీడియా వేదికగా డబ్బు ఇవ్వాలంటూ బెదిరింపులు వచ్చాయి. అడిగిన మొత్తాన్ని ఇవ్వకపోతే మూవీని లీక్‌ చేస్తామంటూ కొందరు బ్లాక్‌ మెయిల్‌ చేశారు. మూవీ రిలీజ్‌కు రెండు రోజుల ముందు కీలక సన్నివేశాలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. మరోవైపు సినిమా రిలీజైన రోజే ఆన్‌లైన్‌ లీక్‌ చేశారు. ఆధారాలు సేకరించిన మూవీ యూనిట్‌ 45 మందితో కూడిన ముఠాపై తాజాగా ఫిర్యాదు చేసింది. ఈ ముఠా వెనుక ఉన్నదెవరు? అనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు సోషల్‌ మీడియా వేదికగా సినిమాపై నెగెటివిటీ సృష్టిస్తున్న కొన్ని ఖాతాలపై 'గేమ్‌ ఛేంజర్‌' టీమ్‌ కంప్లైంట్ ఇచ్చింది. రామ్‌చరణ్‌ హీరోగా డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కించిన మూవీ ఇది. సంక్రాంతి కానుకగా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

First Published:  13 Jan 2025 4:47 PM IST
Next Story