సంగారెడ్డి జిల్లాకు చెందిన వైద్య విద్యార్థిని స్నిగ్ధ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా పటన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన స్నిగ్ధ.. ఫిలిప్పీన్స్‌లో వైద్యవిద్యను అభ్యసిస్తున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి సమయంలో తన ఫ్రెండ్స్ విషెస్ చెప్పడానికి వెళ్లేసరికి ఆమె రూమ్‌లో శవమై కనిపించారు. సమాచారం అందుకున్న పటాన్‌చెరులోని ఆమె కుటుంబసభ్యులు కన్నీటిపర్వంతమయ్యారు. ఆమె తండ్రి అమృత్‌రావు విద్యుత్‌శాఖ డీఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించడానికి ఫిలిప్పీన్స్ దేశ అధికారులతో సంప్రదింపులు జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Previous Articleభారీ మొత్తంలో సూసైడ్ డ్రోన్ల ఉత్పత్తికి కిమ్ ఆదేశం
Next Article వచ్చే ఏడాది ప్రారంభానికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి
Keep Reading
Add A Comment