Telugu Global
CRIME

నకిలీ టికెట్లతో శ్రీవారి దర్శనం.. పోలీసుల అదుపులో ఐదుగురు

హైదరాబాద్‌, ప్రొద్దుటూరు, బెంగళూరుకు చెందిన 11 మంది భక్తుల నుంచి రూ. 19 వేలు వసూలు చేస్తున్నట్లు విచారణలో వెల్లడి

నకిలీ టికెట్లతో శ్రీవారి దర్శనం.. పోలీసుల అదుపులో ఐదుగురు
X

నకిలీ ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 300 టికెట్లు) టికెట్లతో భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తున్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కొందరు దళారులు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టికెట్లతో భక్తులకు శ్రీవారి దర్శనం చేయిస్తున్నారని అనుమానం వచ్చిన టీటీడీ విజిలెన్స్‌ అధికారులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వద్ద కొందరు భక్తులను నిలిపివేశారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన విజిలెన్స్‌ అధికారులు.. ట్యాక్సీ డ్రైవర్ల ద్వారా నకిలీ టికెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. విచారణలో మరో ఐదుగురు నిందితులను అధికారులు గుర్తించారు. వారిలో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కౌంటర్‌ ఉద్యోగి లక్ష్మీపతి, అగ్నిమాపక శాఖ సిబ్బంది మణికంఠ, భానుప్రకాశ్‌, ట్యాక్సీ డైవర్లు శశి, జగదీశ్‌ ఉన్నారు. లక్ష్మీపతి విధుల్లో ఉన్నప్పుడు నకిలీ టికెట్లతో దర్శనానికి పంపుతున్నట్లు గుర్తించారు. మణికంట సాయంతో నకిలీ టికెట్లు తయారు చేస్తున్నారని.. ట్యాక్సీ డైవర్లు శశి, జగదీశ్‌ ద్వారా భక్తులకు టికెట్లు విక్రయిస్తున్నట్లు తేల్చారు. హైదరాబాద్‌, ప్రొద్దుటూరు, బెంగళూరుకు చెందిన 11 మంది భక్తుల నుంచి రూ. 19 వేలు వసూలు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం ఈ ఐదుగురు నిందితులను టీటీడీ విజిలెన్స్‌ అధికారులు, వన్‌టౌన్‌ పోలీసులు విచారిస్తున్నారు.

First Published:  15 Jan 2025 5:27 PM IST
Next Story