Telugu Global
CRIME

బిష్ణోయ్‌ గ్యాంగ్‌ హిట్‌ లిస్ట్‌ లో సిద్దిఖీ కుమారుడు

తండ్రీకొడుకును చంపేందుకు షూటర్లకు కాంట్రాక్ట్‌.. పోలీసుల విచారణలో గుర్తింపు

బిష్ణోయ్‌ గ్యాంగ్‌ హిట్‌ లిస్ట్‌ లో సిద్దిఖీ కుమారుడు
X

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ మాత్రమే కాదు ఆయన కుమారుడు, ఎమ్మెల్యే జీషన్‌ సిద్దిఖీపైనా బిష్ణోయ్‌ గ్యాంగ్‌ కన్ను వేసింది. తండ్రీకొడుకులను చంపేందుకు షూటర్లకు కాంట్రాక్ట్‌ ఇచ్చింది. సిద్దిఖీ హత్య తర్వాత పోలీసుల విచారణలో షూటర్లు ఈ విషయం చెప్పినట్టుగా వార్తలు గుప్పుమంటున్నాయి. బాబా సిద్దిఖీతో పాటు ఆయన కొడుకూ అదే ప్రాంతంలో ఉంటారని, ఇద్దరినీ చంపాలని తమకు కాంట్రాక్ట్‌ ఇచ్చిన వ్యక్తులు చెప్పారని షూటర్లు వెల్లడించారు. ఒకవేళ ఇద్దరినీ చంపడం వీలు కాకపోతే ఎవరిని చంపగలిగితే వారిని టార్గెట్‌ చేయాలని సూచించారని వివరించారు. బాబా సిద్దిఖీపై ముగ్గురు వ్యక్తులు ఆరు రౌండ్లు కాల్పులు జరపడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతిచెందాడు. ఆయన హత్య తామే చేశామని బిష్ణోయ్‌ గ్యాంగ్‌ వెల్లడించింది. హత్యలో పాల్గొన్నట్టు అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ముంబయి మురికివాడలకు సంబంధించిన కాంట్రాక్ట్‌ పనుల్లో విభేదాలతోనే సిద్దిఖీని బిష్ణోయ్‌ గ్యాంగ్‌ టార్గెట్‌ చేసినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనుండటంతో సిద్ధిఖీ హత్య కలకలం సృష్టించింది.

First Published:  14 Oct 2024 4:38 PM IST
Next Story