పాకిస్థాన్ లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులను కనిపిస్తే కాల్చివేయాలని ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది. తెహ్రీక్ – ఏ – ఇన్సాఫ్ ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలని కోరుతూ ఆయన భార్య బుష్రా బీబీ, ఖైబర్ పఖ్తుంఖా సీఎం అలీ అమీన్ నేతృత్వంలో లక్షలాది మంది కవాతు నిర్వహిస్తున్నారు. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఈ ఆందోళన చేపట్టకుండా పోలీసులు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టినా లక్షలాదిగా వచ్చిన ఆందోళనకారులను కట్టడి చేయలేకపోయారు. సోమవారం రాత్రి ఈ కవాతు ఇస్లామాబాద్ కు చేరింది. ఆందోళనకారులను కట్టడి చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా వారిపై ఎదురు దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆందోళనకారుల దాడిలో ఐదుగురు పోలీసులు, పోలీసులు దాడిలో నలుగురు ఆందోళనకారులు మృతిచెందారు. దీంతో ఆందోళనకారులను కట్టడి చేసేందుకు కాల్చేందుకు కూడా వెనుకాడొద్దని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
Previous Articleకాంగ్రెస్ గ్యారంటీలపై సొంత పార్టీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
Next Article రాజ్యంగం మార్చ్ పేరుతో షర్మిల పాదయాత్ర
Keep Reading
Add A Comment