Telugu Global
CRIME

సైఫ్‌కు నాలుగు చోట్ల స్వల్పంగా, రెండు చోట్ల లోతుగా గాయాలు

శస్త్రచికిత్స చేసిన వైద్యులు... నటుడికి ప్రమాదం తప్పిందని ప్రకటన

సైఫ్‌కు నాలుగు చోట్ల స్వల్పంగా, రెండు చోట్ల లోతుగా గాయాలు
X

ప్రముఖ బాలీవుడ్‌ నటుటు సైఫ్‌ అలీఖాన్‌ పటోడీపై తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. ముంబయి బాంద్రాలోని తన నివాసంలో సైఫ్‌ అలీఖాన్‌, ఆయన భార్య కరీనా కపూర్‌ పిల్లలతో కలిసి రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఒక దుండగుడు వారి ఇంట్లోకి ప్రవేశించాడు. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో అలికిడి కావడంతో నిద్ర లేచిన సైఫ్‌ దుండగుడిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరికి ఘర్షణ జరగగా..గుర్తు తెలియని వ్యక్తి పదునైన ఆయుధంతో సైఫ్‌ను పలుమార్లు పొడిచి పారిపోయాడు. గాయపడిన సైఫ్‌ను ఆయన కుటుంబసభ్యులు వెంటనే ముంబాయిలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున 3.30 గంటలకు ఆస్పత్రికి చేరుకున్న సైఫ్‌కు ఒంటిపై ఆరుచోట్ల గాయలైనట్లు డాక్టర్లు గుర్తించారు. వెంటనే ఆయనకు శస్త్రచికిత్స చేసి కుట్లు వేశారు. నాలుగు చోట్ల కొద్దిగా.. రెండు చోట్ల లోతుగా గాయాలైనట్లు లీలావతి ఆస్పత్రి డాక్టర్లు ప్రకటించారు. వెన్నెముకకు సమీపంలో గాయాలైనట్లు వివరించారు. అత్యంత పదునైన ఆయుధంతో దాడి జరిగిందని డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు ప్రమాదం తప్పినట్లు వైద్యులు ప్రకటించారు.

గుర్తు తెలియని వ్యక్తి దొంగతనం చేయడానికి ఇంట్లోకి చొరబడిన సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు సైఫ్‌ అలీఖాన్‌ వ్యక్తిగత బృందం తెలిపింది. తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపిన ఆయన బృందం అభిమానులు, మీడియా సంయమనం పాటించాలని కోరింది. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసినముంబయి క్రైం బ్రాంచ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో పనిమనుషులను ప్రశ్నించారు. ఇది దొంగ పనేనా.. అన్నికోణాల్లో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. సైఫ్‌ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

చిరంజీవి, ఎన్టీఆర్‌ పోస్ట్‌

ఈ దాడిపై నటులు, చిరంజీవి, ఎన్టీఆర్‌ స్పందించారు. విషయం తెలిసి తాను షాకయ్యామని అన్నారు. సైఫ్‌ అలీఖాన్‌పై దాడి నన్ను ఎంతగానో కలిచి వేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా అని చిరంజీవి పోస్ట్‌ పెట్టారు. సైఫ్‌ సర్‌పై దాడి గురించి తెలిసి షాకయ్యా. ఇది నిజంగా బాధాకరం. ఆయన త్వరితగతిన కోలుకోవాలని ఆరోగ్యంగా తిరిగిరావాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. మరోవైపు అభిమానులు సైఫ్‌ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు.

First Published:  16 Jan 2025 11:52 AM IST
Next Story