Telugu Global
CRIME

సైఫ్‌పై దాడి..దుండగుడు ఇంట్లో వస్తువులు ఏవీ దొంగిలించలేదు

ఈ ఘటనపై నటుడి సతీమణి కరీనా కపూర్‌ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన బాంద్రా పోలీసులు

సైఫ్‌పై దాడి..దుండగుడు ఇంట్లో వస్తువులు ఏవీ దొంగిలించలేదు
X

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై దుండగుడు దాడికి పాల్పడిన విషయం విదితమే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దాడికి పాల్పడిన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాంద్రాలోని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లి అతడిని పలు విషయాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దాడి చేయడానికి గల కారణమేమిటన్న కోణంలో విచారించారని సమాచారం.

అయితే తాజాగా దీనిపై నటుడి సతీమణి కరీనా కపూర్‌ స్టేట్‌మెంట్‌ను బాంద్రా పోలీసులు రికార్డు చేసుకున్నారు. ఆమె దాడి గురించి పలు విషయాలు తెలియజేశారు. దాడికి పాల్పడిన సమయంలో దుండగుడు ఎంతో ఆవేశంగా ఉన్నాడని చెప్పారు. సుమారు ఆరుసార్లు కత్తితో సైఫ్‌పై దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. అయితే అతను ఇంట్లో వస్తువులు ఏవీ దొంగిలించలేదని చెప్పారు.

First Published:  18 Jan 2025 12:35 PM IST
Next Story