మాజీ ఎంపీ, ప్రస్తుత శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న కామేపల్లి తులసిబాబుకు చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఇటీవల తులసిబాబు పిటిషన్‌పై వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును రిజర్వు చేసింది. నేడు ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ప్రస్తుతం తులసిబాబు గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ సీఐడీలో న్యాయ సలహాదారుగా కొన్నిరోజులు పనిచేసినట్లు ప్రకాశం జిల్లా పోలీసుల విచారణలో వెల్లడైంది.
Previous Articleడాలర్‌కు బదులు మరో కరెన్సీ తీసుకొస్తే ‘బ్రిక్స్’ అంతమే
Next Article వాలంటైన్స్ డే రోజు అమానుషం.. యువతిపై యాసిడ్ దాడి
Keep Reading
Add A Comment