Telugu Global
CRIME

బెంగళూరు-హైదరాబాద్‌ నేషనల్‌ హైవేపై రోడ్డు ప్రమాదం

10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు..వీరిలో బస్సు క్లీనర్‌, ఇద్దరు కూలీల పరిస్థితి విషమం

బెంగళూరు-హైదరాబాద్‌ నేషనల్‌ హైవేపై రోడ్డు ప్రమాదం
X

బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఏవీఎం ట్రావెల్స్‌ బస్సు, ఇదే మార్గంలో మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోటకు వెళ్తున్న ఐచర్‌ వాహనం శనివారం అర్ధరాత్రి సుమారు 2.30 గంటల ప్రాంతంలో నేషనల్‌ హైవే 44 పై గార్ల దిన్నె మండలం కలగాసపల్లి వద్ద ఢీకొన్నాయి. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో బస్సు క్లీనర్‌, ఇద్దరు కూలీల పరిస్థితి విషమంగా ఉన్నది. క్షతగాత్రులను అనంతపురం గవర్నమెంట్‌ హాస్పటల్‌కు తరలించారు. గాయపడిన వారు తెలంగాణ రాష్ట్రం పాలమూరుకు చెందిన కూలీలుగా గుర్తించారు.

ఈ ఘటనతో నేషనల్‌ హైవేపై ట్రాఫిక్‌ పూర్తిగా స్తంభించింది. ఎస్‌ఐ బాషా, పోలీస్‌ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. రాకపోకలు సజావుగా సాగడానికి చర్యలు చేపట్టారు.

First Published:  29 Sept 2024 7:27 AM IST
Next Story