Telugu Global
CRIME

కేరళలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మెడికల్‌ విద్యార్థుల మృతి

బస్సును ఢీ కొట్టిన కారు.. ప్రమాద తీవ్రతకు కారు నుంచి బైటపడిన విద్యార్థులు

కేరళలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మెడికల్‌ విద్యార్థుల మృతి
X

కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మెడికల్‌ విద్యార్థులు దుర్మరణం చెందారు. కాసర్‌కోడ్‌లో మెడికల్‌ విద్యార్థులు వెళ్తున్న కారు ఆర్టీసీ బస్సును వేగంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నది. చనిపోయిన విద్యార్థులు అలప్పుజ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. వేరే వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేయడానికి యత్నించగా..అదపు తప్పిన కారు బస్సును ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఏడుగురు ఉన్నారు. మిగిలిన ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు విద్యార్థులు కారు నుంచి బైట పడ్డారు. బస్సులోని ప్రయాణికులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి.

మృతులను కొట్టాయంకు చెందిన ఆయుష్ షాజీ (19), పాలక్కాడ్‌కు చెందిన శ్రీదీప్ వత్సన్ (19), మలప్పురానికి చెందిన బి. దేవానందన్ (19), మహ్మద్ అబ్దుల్...మలప్పురానికి చెందిన బి. దేవానందన్ (19), కన్నూర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ జబ్బార్ (19), లక్షద్వీప్‌కు చెందిన మహ్మద్ ఇబ్రహీం (19) గా గుర్తించారు. ఈ ఐదుగురు అలప్పుజా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌ విద్యార్థులు. మరో ఇద్దరికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది.



First Published:  3 Dec 2024 11:38 AM IST
Next Story