సీఎంఆర్ కాలేజీ హాస్టల్ బాత్‌రూమ్‌లో వీడియోల రికార్డింగ్ కలకలం
బాత్‌రూమ్‌లో ఉన్నప్పుడు వీడియోలు తీస్తున్నారని యువతుల ఆరోపణ.. కేసు నమోదు చేసిన పోలీసులు
BY Raju Asari2 Jan 2025 1:06 PM IST
X
Raju Asari Updated On: 2 Jan 2025 1:06 PM IST
సీఎంఆర్ కాలేజీ హాస్టల్‌లో వీడియోల రికార్డింగ్ కలకలం సృష్టించింది. హాస్టల్ బాత్‌రూమ్ వెంటిలేటర్‌పై చేతిగుర్తులు లభించాయి. బైటి నుంచి కెమెరా పెట్టినట్లుగా అద్దంపై గుర్తులు కూడా లభించాయి. రాత్రి ఒంటిగంటకు ఓ విద్యార్థిని కెమెరాను గుర్తించింది. రెండుమూడు చోట్ల కెమెరాలు పెట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాత్‌రూమ్‌లో ఉన్నప్పుడు వీడియోలు తీస్తున్నారని యువతులు ఆరోపిస్తున్నారు. విద్యార్థినులకు మద్దతుగా విద్యార్థి సంగాలు అర్ధరాత్రి 2 గంటల వరకు ఆందోళన కొనసాగించాయి.
ఈ ఘటన సమాచారం అందుకున్న ఏసీపీ, సీఐ సీఎంఆర్ కాలేజీ హాస్టల్‌కు చేరుకున్నారు. చర్యలు తీసుకుంటామని సీఐ హామీతో విద్యార్థి సంఘాలు ఆందోళన విరమించాయి. విద్యార్థుల ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మేడ్చల్ పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story