Telugu Global
CRIME

అత్యాచారం కేసులో ఆశారాంకు మధ్యంతర బెయిల్‌

అనారోగ్య కారణాల నేపథ్యంలో మార్చి 31 వరకు బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

అత్యాచారం కేసులో ఆశారాంకు మధ్యంతర బెయిల్‌
X

అత్యాచార కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న వివాదాస్పద స్వామిజీ ఆశారాంకు ఊరట దక్కింది. సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంత బెయిల్‌ మంజూరు చేసింది. అనారోగ్య కారణాల నేపథ్యంలో న్యాయస్థానం ఆశారాంకు మార్చి 31 వరకు బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌పై విడుదలైన ఆయన తన అనుచరులను కలవకూడదని కోర్టు ఆదేశించింది. అంతేగాకుండా, ఆశారం ఆస్పత్రికి వెళ్లేటప్పుడు భద్రత కల్పించాలి తప్ప ఆయన ఎక్కడికి వెళ్లాలో నిర్దేశించవద్దని పోలీసులను కోరింది.

గుజరాత్ మోతేరాలోని ఆశారాం ఆశ్రమంలో పనిచేస్తున్న సమయంలో తనపై ఆయన పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు సూరత్ కు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2001-2006 మధ్య తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆశారాంతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు.

ఈ కేసులో గాంధీనగర్‌ సెషన్స్‌ కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఆయన భార్య సహా మిగిలిన ఆరుగురిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. అనంతరం ఆశారాంకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.. కాగా.. జోధ్‌పూర్‌లోని ఆశ్రమంలో ఓ 16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులోనూ ఆయన దోషిగా తేలారు. ఈ కేసులోనూ ఆయన దోషిగా తేలారు. ఈ కేసులోనూ ఆయనకు జీవిత ఖైదు పడింది.

First Published:  7 Jan 2025 4:44 PM IST
Next Story