Telugu Global
CRIME

హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై అత్యాచార కేసు నమోదు

బడోలీ, మిట్టల్‌ బలవంతంగా మద్యం తాగించి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు యువితి ఫిర్యాదు

హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై అత్యాచార కేసు నమోదు
X

హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్‌ లాల్‌ బడోలీ, సింగర్‌ రాకీ మిట్టల్‌ అకా జై భగవాన్‌పై గ్యాంగ్‌ రేప్‌ కేసు నమోదైంది. ఢిల్లీకి చెందిన ఓ యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ గ్యాంగ్‌ రేప్‌ ఘటన 2023 జులై 3న జరిగినట్లు యువతి పేర్కొన్నది. తన యజమాని, స్నేహితురాలితో కలిసి హిమాచల్‌ ప్రదేశ్‌కు వచ్చినప్పుడు ఈ అఘాయిత్యం చోటుచేసుకున్నదని తెలిపింది.

హిమాచల్‌లోని కసౌలీకి నా ఫ్రెండ్‌తో కలిసి పర్యాటకురాలిగా వెళ్లాను. ఓ హోటల్‌లో బడోలీ, మిట్టల్‌ కలిశారు. తాను నటిగా మారడానికి అవకాశం ఇస్తానని, తాను తీయబోయే ఆల్బమ్‌లో అవకాశం ఇస్తానని మిట్టల్‌ చెప్పారు. బడోలీ తాను సీనియర్‌ రాజకీయ నాయకుడని, తనకు పెద్దస్థాయిలో పరిచయాలు ఉన్నాయని, ప్రభుత్వం ఉద్యోగం ఇప్పిస్తానని ప్రలోభపెట్టారు.అనంతరం తమకు బలవంతంగా మద్యం తాగించారు. నా ఫ్రెండ్‌ను బెదిరించి పక్కకు తీసుకెళ్లారు. అనంతరం నాపై ఇద్దరు కలిసి లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. నా నగ్న ఫొటోలు, వీడియోలు తీసుకున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై 376డి, 506 సెక్షన్ల కింద నమోదు చేసినట్లు సోలన్‌ ఎస్పీ గౌరవ్‌ సింగ్‌ తెలిపారు. ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, విచారణ చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

First Published:  15 Jan 2025 8:18 AM IST
Next Story