జార్ఖండ్ లో రైల్వే ట్రాక్ పేల్చివేత
తప్పిన పెను ప్రమాదం.. రైళ్ల రాకపోకలకు అంతరాయం
BY Naveen Kamera2 Oct 2024 9:55 PM IST
X
Naveen Kamera Updated On: 2 Oct 2024 9:55 PM IST
జార్ఖండ్ గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే ట్రాక్ ను పేల్చేశారు. ఆ సమయంలో ట్రాక్ పై రైళ్లు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జార్ఖండ్ రాజధాని సమీపంలోని సాహిబ్ గంజ్‌లో భారీ పేలుడు పదార్థాలు ఉపయోగించి ట్రాక్ పేల్చేశారు. ఈ పేలుడు దాటికి 39 మీటర్ల పొడవులో ట్రాక్ దెబ్బతింది.. మూడు అడుగుల లోతైన గొయ్యి ఏర్పడింది. సాహిబ్ గంజ్ జిల్లా బార్హెట్ సమీపంలో రంగ ఘుట్టు గ్రామ సమీపంలో ఈ పేలుడు సంభవించిందని అధికారులు వెల్లడించారు. పేలుడు తర్వాత ఆ ట్రాక్ పై బొగ్గు లోడుతో వచ్చిన రైలు ట్రాక్ దెబ్బతిన్న ప్రాంతానికి కొంత దూరంలో ఆగిపోయింది. భారీ శబ్దంతో పేలుడు ఏర్పడటంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. జార్ఖండ్ పోలీసులు ట్రాక్ పేల్చివేతపై దర్యాప్తు చేస్తున్నారు.
Next Story